భారత దేశం భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక రకమైన సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. అలానే దేవుళ్లను పూజించే విధానాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అనేక ప్రాంతాల్లో దేవుళ్లను కొలిచే విధానంలో వింత ఆచారాలు పాటిస్తుంటారు. పురుషులు స్త్రీల చీరలు కట్టుకోవడం, దేవుళ్లకు గడియారలను నైవేథ్యంగా ఇవ్వడం వంటివి వివిధ వెరైటీ ఆచారాలు పాటిస్తుంటారు. ఇక అలానే వానాలు పడేందుకు కూడా దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. కప్పలకు పెళ్లి చేసి.. ఊరంత ఊరేగిస్తారు. చాలా ప్రాంతాల్లో వానాల కోసం ఇలాంటి కార్యక్రమాలనే నిర్వహిస్తుంటారు. అయితే ఓ ప్రాంతంలో మాత్రం కొండరాయిపై చేసిన పాయసాన్ని నాలుకతో అలాగే లాగిస్తుంటారు. మరి.. ఈ వింత ఆచారం ఎక్కడ, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పార్వతీపురం మన్యం జిల్లా సాలరు మండలం కర్మరాజు పేట గ్రామంలో ఓ ఆచారం ఉండేంది. స్థానిక ఆరిలోవ కొండ వద్ద కొండజాకరమ్మ దేవతకు వరదపాశం గ్రామస్తులు చేశారు. గడిచిన నెల రోజులుగా వర్షాలు కురవక పంటలు ఎండిపోతుంటే.. ఈ కార్యక్రమాని నిర్వహించారు. గ్రామంలో ఊరి జన్నతను జోగిదండి, సామాన్లు సేకరించి ఉదయం పది గంటలకు గ్రామస్తులంతా కొండ వద్దకు చేరుకున్నారు. అక్కడ కొండజాకరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
ప్రజలందరూ తలా పిడికెడు బియ్యం వేయగా, జన్నతను పాయసం తయారు చేశారు. పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం గ్రామస్తులు కొండపై చాపరాయి మీద పాయసం పోసి… మోకాళ్లపై కూర్చొన్ని అమ్మవారికి మొక్కారు. అలానే వారి ఆచారం ప్రకారం.. నాలుకతో పాయసాన్ని స్వీకరించారు. పూజలు చేసిన తరువాత గ్రామస్తులు.. ఎవరింటికి వారు వెళ్లారు. ఆ తరువాత గంటకే ఆ ఊరిలో వర్షం పడింది. దీంతో అమ్మవారు అనుగ్రహించి వాన కురిపించిందని గ్రామస్తులంత సంబర పడ్డారు. మరి.. ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భక్తుల భద్రతే తమకు ముఖ్యం అంటున్న TTD ఛైర్మన్ భూమన!