iDreamPost

భక్తుల భద్రతే తమకు ముఖ్యం అంటున్న TTD ఛైర్మన్ భూమన!

భక్తుల భద్రతే తమకు ముఖ్యం అంటున్న TTD ఛైర్మన్ భూమన!

తిరుమల కాలినడక మార్గంలో భద్రత విషయంలో భక్తుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఒక అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రతకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా సమావేశంలో భక్తుల భద్రత విషయంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకి వెల్లడించారు. ఇకపై కాలినడక భక్తులకు ఒక్కొక్కరికి ఒక చేతికర్ర ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇటీవల తిరుమల కాలినడక మార్గంలో లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో చనిపోయింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అటవీ శాఖ టీటీడీకి పలు కీలక సూచనలు చేసింది. వన్య ప్రాణుల దాడుల నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అంటూ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల అమలులో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అందరూ ఈ నిర్ణయాలను తప్పక అనుసరించాలని కోరారు. అటవీ శాఖ నింబధనల ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

టీటీడీ తీసుకున్న నిర్ణయాలు:

  • కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తలా ఒక చేతికర్ర ఇవ్వనున్నారు.
  • కాలిబాటలో రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లకు అనుమతి ఉంటుంది.
  • ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే చిన్న పిల్లలతో కలిసి కాలినడకన వెళ్లేందుకు అనుమతి.
  • కాలినడకన భక్తులను గుంపులుగా పంపాలని నిర్ణయించారు.
  • నడకదారిలో సాధు జంతులకు అయినా ఎలాంటి ఆహారం పెట్టకూడదు. అలా పెట్టే వారిపై చర్యలు ఉంటాయి.
  • సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు అనుమతి ఉండదు.
  • తిరుపతి నుంచి తిరుమల వరకు 500 కెమెరాలు ఏర్పాటు.. అదనంగా డ్రోన్ కెమెరాల వినియోగానికి నిర్ణయం.
  • చిరుత దాడి నేపథ్యంలో.. భక్తుల భద్రత కోసం నైపుణ్యం కలిగిన అటవీ అధికారుల నియామకం చేస్తాం.
  • నడకదారికి ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
  • కాలి నడక మార్గంలో బేస్ క్యాంపుతో పాటుగా మెడికల్ క్యాంపు ఏర్పాటు.
  • భక్తులకు భద్రతపై అవగాహన కల్పించేందుకు నడక మార్గంలో సైన్ బోర్డుల ఏర్పాటు.
  • అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు.
  • కేంద్ర అటవీశాఖ అధ్యయనం తర్వాత ఫెన్సింగ్ ఏర్పాటు విషయంలో నిర్ణయం.
  • తిరుమలలో దుకాణాల యజమానులకు హెచ్చరికలు.. వ్యర్థాలు బయట పడేస్తే జరిమానా.
  • భూదేవీ కాంప్లెక్స్ లో ఇచ్చే దర్శన టికెట్లను గాలిగోపురం వద్ద చెకింగ్ చేయించాల్సిన అవసరం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి