iDreamPost
అయితే వాళ్ళ అంచనాలకు భిన్నంగా నాలుగు సినిమాలు వస్తున్నా దానికి తగ్గ హంగామా అయితే కనిపించడం లేదు. 'రామారావు ఆన్ డ్యూటీ' హీరో రవితేజ అయినప్పటికీ దాని తాలూకు హుషారు బుకింగ్స్ లో కనిపించడం లేదు.
అయితే వాళ్ళ అంచనాలకు భిన్నంగా నాలుగు సినిమాలు వస్తున్నా దానికి తగ్గ హంగామా అయితే కనిపించడం లేదు. 'రామారావు ఆన్ డ్యూటీ' హీరో రవితేజ అయినప్పటికీ దాని తాలూకు హుషారు బుకింగ్స్ లో కనిపించడం లేదు.
iDreamPost
2022లో అత్యంత నీరసమైన నెలగా గడిచిపోయిన జూలై కథ క్లైమాక్స్ కు వచ్చింది. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్ డే, ది వారియర్, థాంక్ యులు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కావడంతో కనీసం ముగింపైనా బాగుండాలని ట్రేడ్ బోలెడు ఆశలు పెట్టుకుంది. అయితే వాళ్ళ అంచనాలకు భిన్నంగా నాలుగు సినిమాలు వస్తున్నా దానికి తగ్గ హంగామా అయితే కనిపించడం లేదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ హీరో రవితేజ అయినప్పటికీ దాని తాలూకు హుషారు బుకింగ్స్ లో కనిపించడం లేదు.
‘ది లెజెండ్’ని ఎవరూ పట్టించుకోకపోయినా టీమ్ మాత్రం ఏదో హిట్ కొట్టేస్తామన్న ధీమాలో ఉంది. ఒక రోజు ముందు వస్తున్న ‘విక్రాంత్ రోనా’ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.
‘పంచతంత్ర కథలు’ అనే మరో చిన్న మూవీ రేస్ లో ఉంది. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడంతో చాలా తక్కువ స్క్రీన్లలో ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఇలాంటి సెన్సిబుల్ స్టోరీస్ ని జనం థియేటర్లలో చూసేందుకు ఏ మేరకు ఇష్టపడతారన్నది డౌటే కేరాఫ్ కంచెరపాలంలాగా ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే తప్ప ఇవి కాకుండా బాలీవుడ్ మూవీ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ భారీ రిలీజ్ దక్కించుకుంటోంది. నార్త్ లో ఓ మోస్తరుగా ఎదురు చూస్తున్నారు కానీ దక్షిణాదిలో మాత్రం దీని గురించిన బజ్ ఏమి లేదు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ టాక్ బయటికి వస్తే కానీ ఇది పికప్ అయ్యే ఛాన్స్ లేదు.
వీటిలో ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. అసలే షూటింగుల బందుతో టాలీవుడ్ లో అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. బాక్సాఫీస్ మరీ దారుణంగా ఉండటం నిర్మాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాణ వ్యయం మీద అదుపు లేకపోవడం వల్లే థియేట్రికల్ బిజినెస్ ని ఎక్కువగా అమ్మాల్సి వస్తోందని గుర్తించారు. ఆ కారణంగానే టికెట్ రేట్ల మీద కంట్రోల్ తప్పిందని ఆ దిశగా చర్యలు తీసుకునే విధంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించబోతున్నారు. ఆల్రెడీ కొన్ని చెప్పేశారు కూడా. ఒకవేళ ఇక్కడ చెప్పిన నాలుగింటిలో ఏదైనా హిట్ అయితే మళ్ళీ విక్రమ్, మేజర్ టైంలో చూసిన సందడి మళ్ళీ కనిపిస్తుంది. లేదంటే జూలై కథ కంచికే