iDreamPost
android-app
ios-app

మాట విన్నారు -కోబ్రాకు కత్తెర వేశారు

  • Published Sep 01, 2022 | 1:09 PM Updated Updated Sep 01, 2022 | 1:09 PM
మాట విన్నారు -కోబ్రాకు కత్తెర వేశారు

నిన్న విడుదలైన విక్రమ్ కోబ్రాకు తమిళనాడులో మిశ్రమ స్పందన, తెలుగులో సోసో రెస్పాన్స్ దక్కింది. టాక్ ఎలా ఉన్నా సుమారు మూడు కోట్లకు పైగా గ్రాస్ తెలంగాణ ఏపీలో కలిపి వచ్చిందని ట్రేడ్ రిపోర్ట్. ఎలా చూసుకున్నా ఇది మంచి ఫిగరే. సరే కంటెంట్ మీద కంప్లయింట్లు ఎన్ని ఉన్నా అభిమానులు కూడా అసంతృప్తి చెందిన విషయం నిడివి. ఏకంగా 3 గంటల 3 నిమిషాల లెన్త్ తో థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు పెద్ద పరీక్ష పెట్టారు. అవసరానికి మించిన చైల్డ్ హుడ్ ఎపిసోడ్, ఓవర్ ఎమోషన్లతో నింపేసిన సాగతీత సీన్లు చాలా ఉన్నాయి. దెబ్బకు దిగి వచ్చిన కోబ్రా టీమ్ రెండో రోజే 20 నిముషాలు ట్రిమ్ చేయాలని డిసైడ్ చేసుకుని ఆ మేరకు కొత్త వెర్షన్ ని రెడీ చేసేసింది.

ఫ్యాన్స్, మీడియా, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్పిన మాటకు విలువిచ్చి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామని యూనిట్ అధికారికంగా ప్రకటించడం విశేషం. హిట్టా ఫ్లాపా పక్కనపెడితే ఇలా చేయడం చాలా అవసరం. ఆ మధ్య నాని అంటే సుందరానికి కూడా ఇదే విషయం మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే దర్శకుడు వివేక్ ఆత్రేయ, మైత్రి సంస్థ ఒప్పుకోలేదు. కొంత తగ్గించమని ఎన్ని కామెంట్లు వినిపించినా పట్టించుకోలేదు. కట్ చేస్తే 9 కోట్ల దాకా నష్టాలతో దెబ్బ తినేసింది. అలా అని కట్ చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని కాదు కానీ కనీసం ఓ పది రోజుల పాటు టాక్ లో మార్పు వచ్చి దాని ప్రభావం కలెక్షన్ల మీద పాజిటివ్ గా మారే ఛాన్స్ ఉండేది కదా.

చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ అంతేసి సమయం థియేటర్లో కూర్చునేందుకు సిద్ధంగా లేరు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, రంగస్థలం, పుష్ప, అర్జున్ రెడ్డి, మహానటి లాంటి వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు.కాబట్టి వీలైనంత మేరకు రెండున్నర గంటల నిడివి ఉండటం ఇప్పుడున్న పరిస్థితిల్లో రికమండెడ్ టైం అని చెప్పాలి. కార్తికేయ 2కు ప్లస్ అయిన వాటిలో రన్ టైం ఒకటి. బింబిసార సైతం ఓ అయిదు నిముషాలు దీనికన్నా ఎక్కువ అంతే. సీతారామంది అదే బాట. సరే ఇక కోబ్రా ఇప్పుడీ తగ్గింపు వల్ల కోలుకుంటుందని చెప్పలేం కాని మనకన్నా బెటర్ గా తమిళ వెర్షన్ కి ఈ నిర్ణయం ప్లస్ అవ్వడం ఖాయం.తెలుగులో పెద్ద అద్భుతాలు ఆశించలేం.