iDreamPost
android-app
ios-app

5 ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ రీమేక్

  • Published Jul 10, 2021 | 8:06 AM Updated Updated Jul 10, 2021 | 8:06 AM
5 ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ రీమేక్

2017లో తమిళంలో వచ్చిన విక్రమ్ వేదా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కోలీవుడ్ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు బాగా తెలుసు. విజయ్ సేతుపతి-మాధవన్ కాంబోలో వచ్చిన ఈ టెర్రిఫిక్ పోలీస్ మాఫియా థ్రిల్లర్ కంటెంట్ లోనే కాదు కమర్షియల్ గానూ గొప్ప విజయం అందుకుంది. ఇది రిలీజైనప్పుడు బాహుబలిని దాటేస్తుందనే అంచనాలు కూడా వచ్చాయంటే ఏ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించిందో అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ వేదా వచ్చాకే విజయ్ సేతుపతికి స్టార్ ఇమేజ్ పెరిగింది. కెరీర్ కొంచెం డౌన్ లో ఉన్న మాధవన్ కూడా ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. జెర్సి ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ వెలుగులోకి వచ్చింది దీని నుంచే.

ఇప్పుడు అయిదేళ్ల తర్వాత దీని రీమేక్ వైపు అడుగులు పడుతున్నాయి. హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ కాంబోలో దీన్ని భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. దర్శకులుగా ఒరిజినల్ వెర్షన్ ని డీల్ చేసిన పుష్కర్ – గాయత్రిలే కెప్టెన్లుగా వ్యవహరించబోతున్నారు. అన్నట్టు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2022 సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్నారు. ఇంకా ఏడాది పైగానే టైం ఉంది కాబట్టి గ్రాఫిక్స్ డిమాండ్ చేయని ఈ సబ్జెక్టుని ఈజీగా పూర్తి చేయొచ్చు. అయితే పోలీస్ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు డాన్ పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే క్లారిటీ ఇవ్వలేదు కానీ రౌడీగా హృతిక్ రోషన్ కనిపించే అవకాశాలు ఎక్కువ

ఇదంతా బాగానే ఉంది కానీ తెలుగులోనే విక్రమ్ వేదా రీమేక్ దిశగా అడుగులు పడకపోవడం విచారకరం. ఒక టైంలో వెంకటేష్ రానా కాంబో అనుకున్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత రవితేజ పేరు కూడా వినిపించింది కానీ అది న్యూస్ దగ్గరే ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి చడీచప్పుడు లేదు. పోనీ డబ్బింగ్ అయినా చేస్తారేమో అని మూవీ లవర్స్ ఎదురు చూశారు కానీ అదీ జరగలేదు. మలయాళంలో చిన్న చిన్న హిట్లను సైతం వదలకుండా రీమేకులు చేస్తున్న మనవాళ్ళు ఈ విక్రమ్ వేదాని ఇలా వదిలేయడం విచిత్రమే. మొత్తానికి బాలీవడ్ లో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరింది

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetHepyek girişkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş