ఒకవైపు తల్లి మరణం మరోవైపు కరోనా విధులు.. ఎస్సై దేన్ని ఎంచుకున్నాడో తెలుసా..?

  • Published - 08:54 AM, Sat - 4 April 20
ఒకవైపు తల్లి మరణం మరోవైపు కరోనా విధులు.. ఎస్సై దేన్ని ఎంచుకున్నాడో తెలుసా..?

దేశంలో లాక్ డౌన్ విధించిన అనంతరం పోలీసులు, డాక్టర్లు,హెల్త్ వర్కర్లు ప్రజలకు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు.. ముఖ్యంగా పోలీసులు రేయింబవళ్లు ప్రజలకు సేవ చేస్తున్నారు. కాగా విజయవాడలో ఎస్‌ఐగా పని చేస్తున్న శాంతారాం వృత్తిలో చూపిన నిబద్ధతకు ప్రజలతో పాటు పోలీసులు కూడా సెల్యూట్ చేస్తున్నారు..

కన్న తల్లి చనిపోయిందని తెలిసినా ఆ బాధను గుండెల్లోనే దిగమింగి శాంతారాం విధుల్లో పాల్గొన్నారు.. తన తమ్ముడికి తల్లి అంత్యక్రియలు జరిపించాలని తెలిపి వీడియో కాల్ లోనే తల్లిని చివరి చూపు చూసుకున్నారు శాంతారాం..ఆయనకు సెలవు ఇచ్చినప్పటికీ, ఇంటికి వెళ్ళడానికి వాహనం ఏర్పాటు చేసినప్పటికీ అంత్యక్రియలకు వెళ్లక పోవడం గమనార్హం.

శాంతారాం మాట్లాడుతూ 3 రోజుల క్రితం తన తల్లి అనారోగ్యంతో మృతిచెందారని, అంత్యక్రియలకు వెళ్లాలంటే 4 జిల్లాలు, 40 చెక్‌పోస్టులు దాటి వెళ్లాలని, అంతేకాకుండా ఎంతోమందిని కలవాల్సి ఉంటుందని, దానివల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు..నేను విధులకు దూరంగా ఉంటే తన తల్లి ఆత్మ శాంతించదని, ఈ సమయంలో తాను విధుల్లో ఉంటేనే తన తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తూ అంత్యక్రియలకు వెళ్లలేదని ఎస్సై వెల్లడించారు. ఒకవేళ వెళ్లినా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని, విధులకు ఆటంకం కలుగుతుందని వెళ్లలేదని శాంతారాం తెలిపారు.

కాగా వృత్తి పట్ల శాంతారామ్ చూపించిన నిబద్ధతకు DIG శాంతారాంకు సెల్యూట్ చేశారు. ప్రజలు తాము చేస్తున్న సేవను గుర్తించి మరో రెండు వారాలు బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.. శాంతారాం లాంటి వారి వల్ల పోలీసులు ప్రతిష్టలు మరింత పెరిగాయని శాంతారాం పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు…

Show comments