చంద్రబాబును గుండెదడ రాకుండా చూసుకోమంటున్న వైసిపి ఎంపి

కరోనా వైరస్ నియంత్రణ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి గుండె దడ రాకుండా చూసుకోమంటున్నాడు వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి. ఈ ఎంపి ట్వీట్ ద్వారా హెచ్చరించింది ఎవరినో తెలుసా చంద్రబాబునాయుడును ఆయనకు మద్దతుగా నిలుస్తున్న మీడియా యాజమాన్యాలనే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కరోనా వైరస్ సంక్షోభ సమయంలో గ్రాఫిక్స్ లేకుండా, గాలి వార్తల ప్రచారాలు లేకుండా తాపీగా పనులు జరిగిపోతున్నాయట.

గ్రాఫిక్స్, గాలి వార్తలని విజయసాయి ఎందుకున్నారో తెలుసా ? చంద్రబాబు హయాంలో చాలా వరకూ గ్రాఫిక్సే కనబడేది. అమరావతి రాజధాని నిర్మాణమే చూడండి. మొత్తం నాలుగు సంవత్సరాల పాటు గ్రాఫిక్స్ తోనే కాలం గడిపేశాడు. ఎటువంటి నిర్మాణాలు మొదలు చేయకుండానే సాంతం రాజధాని నిర్మాణమే అయిపోయిందన్నట్లుగా జనాలు భ్రమల్లో ముంచేశాడు. సరే ఎన్నికల సమయానికి ఆ గ్రాఫిక్సే కొంప ముంచేసిందనుకోండి అది వేరే సంగతి.

ఇక అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఉత్తరాంధ్రలో హుద్ హూద్ తుపాను వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్కడ జరిగిన సహాయ పునరావాస పనులు తక్కువ. అయితే తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలన్నింటినీ పూర్తిగా పునరుద్ధరించేసినట్లుగా ప్రచారం చేసుకున్నారు. అన్నింటికన్నా విచిత్రమేమిటంటే చంద్రబాబు థ్యాంక్స్ చెబుతూ ఉత్తరాంధ్రలో పెద్ద పెద్ద వినైల్ పోస్టర్లు వేయించుకున్నారు. అటువంటి హోర్డింగులనే అమరావతిలో పెట్టించటం పిచ్చికి పరాకాష్ట. తీరాచేస్తే జరిగిన అభివృద్ధి తక్కువ అభివృద్ధి పనులతో మేసేసిందే చాలా ఎక్కువ.

బహుశా అటువంటి మాయాజాలాన్ని దృష్టిలో పెట్టుకునే విజయసాయి ట్వీట్లో చంద్రబాబును ఏకిపారేశాడు. కరోనా చికిత్సలోను, చికిత్స పరికరాల ఉత్పత్తిలోను దేశానికే మార్గదర్శకం కాబోతోందన్నారు. ఇప్పటికయ్యింది పది నెలలే. ఇంకా నాలుగు సంవత్సరాల్లో చాలా వండర్స్ చూడాల్సుంటుందని ఎంపి ఎద్దేవా చేశాడు. అందుకే గుండెదడ రాకుండా చూసుకోమని సవాలు లాంటి వార్నింగ్ ఇచ్చాడు.

Show comments