iDreamPost
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇండియా వైడ్ సుమారుగా 60 కోట్లకు పైగా లాస్ తప్పదని తెలిసింది.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇండియా వైడ్ సుమారుగా 60 కోట్లకు పైగా లాస్ తప్పదని తెలిసింది.
iDreamPost
భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ మొదటి వారం పూర్తి చేసుకుంది. ఇక ఆశలు పెట్టుకోవడానికి ఏమి లేదు కానీ నష్టాలు లెక్కలేసుకునే పనిలో పూరి టీమ్ బిజీగా ఉంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇండియా వైడ్ సుమారుగా 60 కోట్లకు పైగా లాస్ తప్పదని తెలిసింది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుని బరిలో దిగిన లైగర్ ఇప్పటిదాకా కనీసం 30 మార్కును కూడా అందుకోలేక పోయింది. చాలా బిసి సెంటర్స్ లో నిన్నే ఆఖరి రోజు. అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్న అడిషినల్ స్క్రీన్లన్నీ రేపటి కొత్త రిలీజులకు ఇచ్చేశారు. గత మూడు రోజులుగా కలెక్షన్లు అన్యాయంగా ఉండటంతో జల్సా, తమ్ముడుతో రీ ప్లేస్ చేసిన ఉదంతాలున్నాయి.
ఓవర్సీస్ లోనూ లైగర్ కు పెద్ద దెబ్బ తప్పలేదు. అతికష్టం మీద 3 కోట్ల పైచిలుకు మొత్తం దాటింది. నైజామ్ లోనే చాలా బెటర్ అనిపించేలా 5 కోట్ల 70 లక్షలు రాబట్టిన ఈ బాక్సింగ్ డ్రామా అత్యల్పంగా నెల్లూరు నుంచి కేవలం 54 లక్షలు మాత్రమే వసూలు చేసింది. సీడెడ్ 1 కోటి 85 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 75 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 1 కోటి 40 లక్షలు, గుంటూరు 1 కోటి, కృష్ణా 69 లక్షలు తెచ్చుకుంది. కర్ణాటకతో కలిపి రెస్ట్ అఫ్ ఇండియా 1 కోటి 50 లక్షలు రాగా హిందీ వెర్షన్ ఒకటే 8 కోట్లలోపే పరిమితమయ్యింది. కాకపోతే లాల్ సింగ్ చడ్డాతో పోటీ పడాల్సి రావడమే బ్యాడ్ న్యూస్. టాలీవుడ్ టయర్ టూ హీరోల్లో అతి పెద్ద డిజాస్టర్ విజయ్ దేవరకొండ ఖాతాలోకే చేరింది.
ఇక రేపటి నుంచి లైగర్ గురించి చెప్పుకోవడానికి ఈ మాత్రం ముచ్చట్లు కూడా ఉండవు. ఫైనల్ రన్ గురించి ఎదురు చూడటం తప్ప ఇంకేమి ఉండదు. దర్శకుడు కం నిర్మాతల్లో ఒకరైన పూరి జగన్నాధ్ నష్టాలకు సంబంధించి ఎక్కువ పూచికత్తు తీసుకోబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. కరణ్ జోహార్ పాత్ర ఎంత మేరకు ఉంటుందనేది తెలియాల్సి ఉంది. విడుదలైన మరుసటి రోజు హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో కనిపించడం తప్ప మళ్ళీ టీమ్ ఎక్కడా మీడియాతో కలుసుకునే సందర్భాన్ని తీసుకురాలేదు. ఎలాగూ ఫ్లాపు తాలూకు కబుర్లే ఉంటాయనే ఉద్దేశంతో అందరూ మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇదే కాంబోలో జనగణమన వెంటనే ఉంటుందా లేక ఆలస్యం చేస్తారా అనేది వేచి చూడాల్సిన ఆసక్తికరమైన అప్డేట్