iDreamPost
android-app
ios-app

LIGER లైగర్ బిజినెస్ – టార్గెట్ పెద్దదే

  • Published Aug 22, 2022 | 11:35 AM Updated Updated Aug 22, 2022 | 11:35 AM
LIGER లైగర్ బిజినెస్ – టార్గెట్ పెద్దదే

ఇంకో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా లైగర్ విడుదల కానుంది. హిందీ వెర్షన్ ఒక రోజు ఆలస్యంగా 26న విడుదల కానుండగా ప్రధాన నగరాల్లో మాత్రం 25 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. దీని వెనుక గల కారణం అంతు చిక్కడం లేదు. మిగిలిన భాషల్లో మాత్రం చెప్పిన డేట్ టైంకి యధావిధిగా షోలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ లో ఉదయం 7 గంటల నుంచే సింగల్ స్క్రీన్లలో మొదలు పెట్టబోతున్నారు. యుఎస్ షెడ్యూల్స్ లో కూడా ఎలాంటి మార్పులు లేవు. సినిమా నిడివి కేవలం 2 గంటల 20 నిమిషాలే ఉండటం ప్లస్ కానుంది. వారం రోజుల పాటు అయిదు షోలు ప్లాన్ చేసుకున్న ఎగ్జిబిటర్లకు ఇది బాగా సానుకూలించే అంశం.

ఇక బిజినెస్ విషయానికి లైగర్ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగుతోంది. రెండు వరస డిజాస్టర్ల తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు కావడం విశేషం. పూరి జగన్నాధ్ కు సైతం ఇదే హయ్యెస్ట్ ఫిగర్ అవుతుంది. నైజామ్ 25 కోట్లు, సీడెడ్ 9 కోట్లు, ఆంధ్రా 28 కోట్లు, కర్ణాటక 5 కోట్ల 20 లక్షలు, తమిళనాడు 2 కోట్ల 50 లక్షలు, కేరళ 1 కోటి 20 లక్షలు, ఓవర్సీస్ 7 కోట్ల 50 లక్షలు, నార్త్ ఇండియాలో ఇస్తున్న హిందీ వెర్షన్ 10 కోట్లు మొత్తం కలిపి 88 కోట్ల 40 లక్షలు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. సో లాభాలు రావాలంటే తొంబై కోట్ల మార్క్ దాటాల్సిందే. టాక్ పాజిటివ్ గా వస్తే ఇదేమంత పెద్ద టాస్క్ కాదు. అందులోనూ పోటీ లేని వాతావరణంలో.

ఏడు ఫైట్లు ఆరు పాటలతో మాస్ ని మెప్పించేలా పూర్తి యాక్షన్ మోడ్ లో లైగర్ ని తీర్చిదిద్దారు పూరి. అయితే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబైతో మొదలుపెట్టి బెంగళూర్ దాకా దేశమంతా ప్రమోషనల్ ఈవెంట్లు చేస్తూ వచ్చిన లైగర్ చివరి ఘట్టానికి చేరుకుంది. బింబిసార, సీతారామం, కార్తికేయ 2లు ఇచ్చిన సక్సెస్ కిక్ కి ఆగస్ట్ లో లైగర్ మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తుందనే నమ్మకంతో లైగర్ టీమ్ ఉంది. మరి తారాస్థాయిలో ఉన్న అంచనాలను లైగర్ ఏ స్థాయిలో అందుకుంటాడో చూడాలి