iDreamPost
android-app
ios-app

అనిమల్ లైగర్ కలవబోతున్నారా ?

  • Published Feb 09, 2021 | 9:19 AM Updated Updated Feb 09, 2021 | 9:19 AM
అనిమల్ లైగర్ కలవబోతున్నారా ?

నాలుగేళ్ల క్రితం 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి రేపిన సంచలనం ఇప్పటి తరం అంత ఈజీగా మర్చిపోలేరు. విజయ్ దేవరకొండని ఒక్క రాత్రిలో స్టార్ గా మార్చి తిరుగులేని ఇమేజ్ ని కట్టబెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీని హిందీ రీమేక్ కబీర్ సింగ్ తప్ప ఇంకే మూవీ చేయకపోవడం అతని అభిమానులను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటుంది. ఇటీవలే హిందీలోనే రన్వీర్ కపూర్ హీరోగా అనిమల్ ను ప్రకటించి కొత్త సెన్సేషన్ కు తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం దీని షూటింగ్ లోనే బిజీ కాబోతున్నాడు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో హీరో క్యారెక్టరైజేషన్ ని చాలా వైల్డ్ గా చూపించబోతున్నట్టు తెలిసింది.

ఆపై తన మొదటి సినిమా హీరో విజయ్ దేవరకొండతోనే సందీప్ వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. అయితే ఇది అర్జున్ రెడ్డి సీక్వెల్ కాదు లెండి. వేరే సబ్జెక్టు కోసమట. కాకపోతే ఇది ఇప్పట్లో సెట్ లోకి వెళ్ళదు. విజయ్ పూరితో చేస్తున్న లైగర్ పూర్తి కావాలి. ఆ తర్వాత ఇంకో బయటికి చెప్పని కమిట్ మెంట్ ఒకటుంది. ఆలోగా సందీప్ వంగా ఆనిమల్ ని ఫినిష్ చేసుకుని అప్పుడు జాయిన్ అవుతాడు. ఇదంతా జరిగే లోపు 2022 వచ్చేస్తుంది కానీ ఆలోగా స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు మరోవైపు సందీప్ వంగా ఆల్రెడీ మొదలుపెట్టేశారని ఇన్ సైడ్ టాక్. ఈ కాంబో ఎవరికి దక్కిందనే డౌట్ వచ్చింది కదా.

గత కొన్నేళ్లుగా క్రేజీ కాంబినేషన్లతో టాప్ బ్యానర్ గా దూసుకుపోతున్న మైత్రి సంస్థ ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నట్టు సమాచారం. ఇద్దరికీ గతంలోనే అడ్వాన్స్ ఇచ్చారట. అయితే ఇద్దరికీ విడివిడిగా వేరే కాంబోలతో చేద్దామనుకుని ఫైనల్ గా జాయింట్ ఆఫర్ చేసినట్టు వినికిడి. ఇది అఫీషియల్ కావడానికి ఇంకా టైం పడుతుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం లైగర్ మీదే పెట్టబోతున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైన నేపథ్యంలో పూరి దీన్ని వేగంగా పూర్తి చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. విడుదల విషయంలో క్లారిటీ లేని పెద్ద సినిమాల్లో ఇదొక్కటే పెండింగ్ లో ఉంది.