iDreamPost
android-app
ios-app

విజయ్ అదిరిపోయే ప్లాన్.. కాఫీ విత్ కరణ్‌లో లైగర్..

  • Published May 31, 2022 | 7:05 AM Updated Updated May 31, 2022 | 7:06 AM
  • Published May 31, 2022 | 7:05 AMUpdated May 31, 2022 | 7:06 AM
విజయ్ అదిరిపోయే ప్లాన్.. కాఫీ విత్ కరణ్‌లో లైగర్..

విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా చార్మీ, పూరి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా హీరోగా అవ్వనున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో కూడా బాగా క్రేజ్ ఉంది. లైగర్ సినిమా రిలీజ్ అవ్వకముందే బాలీవుడ్ పార్టీలకు వెళ్తూ, అక్కడి స్టార్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు.

తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ టాప్ షో అయినా కాఫీ విత్ కరణ్ లో గెస్ట్ గా వెళ్ళాడు. బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ షో బాగా ఫేమస్. అక్కడి హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్.. ఈ షోకి ఒక్కసారన్నా వెళ్ళాలి అనుకుంటారు. కానీ బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే ఈ షోలో పాల్గొని విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

ఇన్నాళ్లు టీవిలో టెలికాస్ట్ ఆయన ఈ షో త్వరలో కొత్త సీజన్ ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపొయింది. తాజాగా ఈ షోలో కాఫీ కప్స్ మీద విజయ్ సైన్ చేయగా ఆ కప్స్ ని ఫోటో తీసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో విజయ్ దేవరకొండ తన లైగర్ సినిమా ప్రమోషన్స్ కాఫీ విత్ కరణ్ షో నుంచే గ్రాండ్ గా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ టాప్ షోలో విజయ్ పాల్గొన్నాడు అని తెలియడంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişmarsbahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom