ANR తర్వాత విజయ్ దేవరకొండే

అదేంటి నట శిఖరం లాంటి అక్కినేని నాగేశ్వర్ రావు గారితో కేవలం 9 సినిమాల అనుభవమున్న విజయ్ దేవరకొండని పోలుస్తున్నారాని షాక్ అవ్వకండి. విషయం వేరే ఉంది.  వరల్డ్ ఫేమస్ లవర్ లో ఒక కథలో భాగంగా హీరో పాత్ర తన కళ్ళను హీరొయిన్ కోసం దానం చేసి ప్రేమలో ఉండాల్సిన త్యాగాన్ని చాటుతుంది. ఇది ఎమోషనల్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఉందనేది పక్కనపెడితే సాధారణంగా ఒక ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి రిస్కులు చేయరు. 

అభిమానులు ఒప్పుకుంటారో లేదో అన్న సంశయం వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. కమల్ హాసన్ లాంటి వర్సటైల్ యాక్టర్లు పూర్తి అంధులుగా నటించారు కాని ఇలా కళ్ళను దానం చేసే కాన్సెప్ట్ మాత్రం ఎవరూ టచ్ చేయలేదు. అది ఒక్కసారి జరిగింది. అదేంటో తెలియాలంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. జంధ్యాల దర్శకత్వంలో 1983లో ఏఎన్ఆర్ అమరజీవి అనే సినిమాలో నటించారు. అందులో తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జయప్రదకు అనుకోకుండా విధివశాత్తు శరత్ బాబుతో పెళ్లవుతుంది. కానీ ఓ ప్రమాదంలో అతని కళ్ళు పోతాయి. 

దాంతో నాగేశ్వర్ రావు తన కళ్ళను అతని కోసం దానమిచ్చి గుడ్డివాడిగా మారిపోతాడు. దీంతో అతని మంచితనం అందరికి తెలుస్తుంది. కానీ ఆ పాత్ర విషాదాంతంగా ముగుస్తుంది. సరిగ్గా అదే తరహాలో వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ దేవరకొండ తనవల్ల కళ్ళు పోగొట్టుకున్న ఈసాబెల్లె కోసం తన రెండు నేత్రాలను దానమిస్తాడు. ప్రేమ ఎంత గొప్పదో చాటుతాడు. అమరజీవి తర్వాత హీరో పాత్ర ఇలా ఐ డొనేషన్
చేయడం ఇప్పుడే. అందుకే ఏఎన్ఆర్ తర్వాత విజయ్ దేవరకొండే అని చెప్పింది. అప్పుడు అమరజీవి ఓవర్ సెంటిమెంట్ వల్ల ఫ్లాప్ అయ్యింది. మరి ఈ ప్రపంచ ప్రేమికుడి అంతిమ ఫలితం ఏమవుతుందో ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.
Show comments