iDreamPost
iDreamPost
అదేంటి నట శిఖరం లాంటి అక్కినేని నాగేశ్వర్ రావు గారితో కేవలం 9 సినిమాల అనుభవమున్న విజయ్ దేవరకొండని పోలుస్తున్నారాని షాక్ అవ్వకండి. విషయం వేరే ఉంది. వరల్డ్ ఫేమస్ లవర్ లో ఒక కథలో భాగంగా హీరో పాత్ర తన కళ్ళను హీరొయిన్ కోసం దానం చేసి ప్రేమలో ఉండాల్సిన త్యాగాన్ని చాటుతుంది. ఇది ఎమోషనల్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఉందనేది పక్కనపెడితే సాధారణంగా ఒక ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి రిస్కులు చేయరు.