iDreamPost
android-app
ios-app

LIGER లైగర్ చుట్టూ సానుకూలతలు సవాళ్లు

  • Published Aug 20, 2022 | 3:59 PM Updated Updated Aug 20, 2022 | 3:59 PM
LIGER లైగర్ చుట్టూ సానుకూలతలు సవాళ్లు

ఇంకో అయిదే రోజుల్లో విజయ్ దేవరకొండ లైగర్ రాబోతోంది. తన మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రౌడీ బాయ్ విపరీతంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. దర్శకుడు పూరి జగన్నాధ్, సహనిర్మాత ఛార్మీ రెస్ట్ లేకుండా ఒకపక్క ఫైనల్ టచ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మరోపక్క ఇంటర్వ్యూలు గట్రా చూసుకుంటున్నారు. ఆగస్ట్ లో బింబిసార, సీతారామం, కార్తికేయ 2లతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడీ లైగర్ తో గ్రాండ్ ఫినిషింగ్ దక్కుతుందనే నమ్మకంతో ట్రేడ్ ఉంది. తెలంగాణ ఏపీలో గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయిదు ఆటలకు అనుమతులకు ఆల్రెడీ అప్లై చేశారు. టికెట్ రేట్ల విషయంలో ఏమనుకుంటున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా లైగర్ చుట్టూ చాలా సవాళ్లు సానుకూలతలు కనిపిస్తున్నాయి. ముందు ఛాలెంజుల విషయానికి వస్తే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మీద బాయ్ కాట్ ప్రభావం గురించి చాలానే మాట్లాడాడు. దీంతో సహజంగానే నార్త్ నెటిజెన్లకు ఇది నచ్చలేదు. అందుకే లైగర్ ని కూడా చూడొద్దంటూ ఒక బ్యాచ్ క్యాంపైన్ మొదలుపెట్టింది. ఒక వర్గం ఇంకో అడుగు ముందుకు వేసి ఇటీవలే విజయ్ ఇంట్లో అర్చకులను నిలబెట్టి తాను అనన్య పాండేతో పాటు సోఫాలో కూర్చుని తీయించిన ఫోటోని దీని కోసం వాడుకుంటున్నారు. ఇలా పూజ చేయించడమేమిటని సాంప్రదాయవాదులు కొత్త వాదన మొదలుపెట్టారు. ఇదంతా కొత్త చర్చకు దారి తీస్తోంది.

మరోపక్క సానుకూలతలు లేకపోలేదు. లైగర్ కి భారీ బిజినెస్ జరిగింది. విజయ్ దేవరకొండ చూస్తేనేమో ఈ సినిమా స్టార్టింగ్ ఫిగరే రెండు వందల కోట్లతో మొదలవుతుందని అంటున్నాడు. ఇంత కాన్ఫిడెన్స్ మంచిదే కానీ అదేదో ఫస్ట్ డే మార్నింగ్ షో టాక్ బయటికి వచ్చాక చెబితే బాగుండేది. అసలే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ. మాస్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. వాళ్ళను సంతృప్తి పరిచేందుకే ఆరు పాటలు, ఏడు ఫైట్లతో దీన్నో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు. పాటలైతే మరీ ఛార్ట్ బస్టర్ రేంజ్ లో వెళ్ళలేదు కానీ రిలీజయ్యాక ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయేమో చూడాలి. హైదరాబాద్ తో సహా కీలక నగరాల్లో బుకింగ్స్ మొదలైపోయాయి