iDreamPost
android-app
ios-app

హెరిటేజ్ డైరీపై విజిలెన్స్ దాడులు

  • Published Feb 10, 2021 | 5:09 PM Updated Updated Feb 10, 2021 | 5:09 PM
హెరిటేజ్ డైరీపై విజిలెన్స్  దాడులు

గుంటూరు జిల్లాలో హెరిటేజ్ డైరీ పార్లర్ సంస్థ చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో ఉన్న హెరిటేజ్ డైరీ పార్లర్ లో నిబందనలకు విరుద్ధంగా కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారనే విషయం తెలియడంతో విజిలెన్స్ అధికారులు ఆ సంస్థ పై దాడులు నిర్వహించారు.ఈ దాడులలో పెద్ద ఎత్తున కాలం చెల్లిన మజ్జిగ ప్యాకెట్లను గుర్తించారు.

హెరిటేజ్ సంస్థ చేస్తున్న ఈ అక్రమాలను గుర్తించిన విజిలెన్స్ అధికారులు భారీగా నిలువ ఉంచిన మజ్జిగ ప్యాకెట్లను జప్తు చేసి హెరిటేజ్ పార్లర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా వివిధ డైరీ పార్లర్ పై విజిలెన్స్ అధికారుల దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచరం. హెరిటేజ్ సంస్థ రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబు కుటుంబ సంస్థ. సదరు సంస్థ ఇలా కాలం చెల్లిన మజ్జిగను అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చలగాటం ఆడటాన్ని స్థానికులు నిరసిస్తున్నారు.