Idream media
Idream media
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కొత్తేమీ కాదు. అలాగే పార్టీపై ఆరోపణలు చేయడం కూడా కొత్తేమీ కాదు. ఎవరో ఒక నేత ఎప్పుడూ పార్టీని విమర్శిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాలలో అలాంటి నేతలపై చర్యలుంటాయి. కొన్నిసార్లు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఇటివలి కాంగ్రెస్ పార్టీపై సొంత పార్టీ నేత వి.హనుమంత రావు సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల పెత్తనం నడుస్తోందని, అధిష్టానం ఈ విషయాన్ని గమనించాలని ఆయన ఆరోపణలు గుప్పించారు. కొందరు డిల్లీలో కూర్చొని పెత్తనం చేస్తున్నారని, వాస్తవాలను అధిష్టానానికి చెప్పనివ్వడం లేదని ఆరోపించారు. ఢిల్లీలో ఉన్నవారు వాస్తవాలను తమ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకు చెప్పడం లేదని హనుమంతరావు అన్నారు.
హనుమంతరావు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురైన ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో విహెచ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. భగవంతుని ఆశీస్సులు తనకు ఉంటాయని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.