ACE Movie Review in Telugu: విజయ్ సేతుపతి తాజా చిత్రం 'ఏస్' తమిళం మరియు తెలుగు భాషలలో మే 23 న రిలీజ్ అయింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఇది రుక్మిణి వసంత్ కు తమిళంలో మొదటి సినిమా. ఈ సినిమాకు అరుముగ కుమార్ దర్శకత్వం వహించాడు . క్రైమ్ కామిడి జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూసేద్దాం.
ACE Movie Review in Telugu: విజయ్ సేతుపతి తాజా చిత్రం 'ఏస్' తమిళం మరియు తెలుగు భాషలలో మే 23 న రిలీజ్ అయింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఇది రుక్మిణి వసంత్ కు తమిళంలో మొదటి సినిమా. ఈ సినిమాకు అరుముగ కుమార్ దర్శకత్వం వహించాడు . క్రైమ్ కామిడి జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూసేద్దాం.
Swetha
విజయ్ సేతుపతి తాజా చిత్రం ‘ఏస్’ తమిళం మరియు తెలుగు భాషలలో మే 23 న రిలీజ్ అయింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఇది రుక్మిణి వసంత్ కు తమిళంలో మొదటి సినిమా. ఈ సినిమాకు అరుముగ కుమార్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ కామిడి జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూసేద్దాం.
కథ :
బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) ఉద్యోగం వెతుక్కుంటూ మలేషియాకు వెళ్తాడు. అక్కడ జ్ఞానందం (యోగి బాబు) అనే వ్యక్తిని కలుస్తాడు. అతను బోల్డ్ కాశీకి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి. ఉద్యోగం దొరకడానికి సహాయం చేస్తాడు. ఈ క్రమంలో బోల్డ్ కాశీకి..కల్పన (దివ్యా పిళ్లై) హోటల్లో చెఫ్‌గా ఉద్యోగం దొరుకుతుంది. అక్కడే బోల్ట్ కాశీకి రుక్మిణి (రుక్మిణి వసంత్) పరిచయం అవుతుంది. రుక్మిణి తన బాబాయ్ నుంచి తన ఇంటికి విడిపించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇది బోల్డ్ కాశీకి తెలుస్తుంది. ఎలా అయినా సరే ఆమెకు హెల్ప్ చేయాలనీ అనుకుంటాడు. దీనితో బోల్డ్ కాశీ రుక్మిణి సమస్య తీర్చేందుకు.. డబ్బుల కోసం మలేసియాలో ఇల్లీగల్ వ్యాపారాలు చేసే ధర్మ (అవినాష్) దగ్గరకు వెళ్తారు. అక్కడకు వెళ్లి బోల్డ్ కాశీ , జ్ఞానందం ఇరుక్కుంటారు. అతని దగ్గర డబ్బు తీసుకుంటారు. తర్వాత ఆ డబ్బు తిరిగి చెల్లించే క్రమంలో ఓ బ్యాంక్ దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తాడు బోల్డ్ కాశీ. వడ్డీ లేట్ అయితేనే ప్రాణాలు తీసే ధర్మ నుంచి బోల్డ్ కాశీ ఎలా తప్పించుకున్నాడు ? బ్యాంక్ దోపిడీ చేసిన డబ్బుతో కాశీ ఏమి చేస్తాడు ? అసలు అతను మలేషియాకు వెళ్ళడానికి కారణం ఏంటి ? చివరకు కథ ఎలా మలుపు తిరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
విజయ్ సేతుపతి ఎప్పటిలానే తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచేశాడని చెప్పొచ్చు. బోల్డ్ కాశీ పాత్రకు విజయ్ సేతుపతి పూర్తి న్యాయం చేశాడు. ఇక రుక్మిణి వసంత్ కు తమిళంలో మొదటి సినిమా అయినా కూడా.. తన పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులు ఫ్రెష్ ఫీలింగ్ ను ఇస్తూ ఉంటుంది. ఇక హీరో హీరోయిన్ కాకుండా సినిమాలో హైలెట్ అయ్యేది యోగిబాబు . యోగిబాబు నటన గురించి తెలియనిది కాదు. తన కామెడీతో అందరిని కడుపుబ్బా నవ్వించేస్తాడు. వీరితో పాటు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన అవినాష్ బబ్లు నటన కూడా బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఇక సినిమాలోని మిగిలిన నటీ నటులు కూడా ఎవరి పాత్రకు తగినట్టు న్యాయం చేసారని చెప్పి తీరాలి.
సాంకేతిక వర్గం పని తీరు :
స్క్రీన్ ప్లే కథ చెప్పే తీరు కాస్త రొటీన్ గా అనిపించినా కూడా.. కొన్ని చోట్ల మాత్రం ఇప్పుడు వస్తున్న మూవీస్ కంటే ఏస్ కాస్త భిన్నంగా కాస్త బాగున్నట్లు అనిపిస్తుంది. కరణ్ బి రావత్ సినిమాటోగ్రఫీ బాగుంది, సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపిస్తుంది. ఇక కొన్ని కొన్ని సీన్స్ దగ్గర కాస్త ట్రిమ్ చేసి వేగం పెంచి ఉంటె బాగుండేది. ఇవి కాకూండా సినిమా డబ్బింగ్ కు మాత్రం పూర్తి న్యాయం చేశారని చెప్పొచ్చు. అరుముగ కుమార్ రచన , దర్శకత్వం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించకపోయినా.. పరవాలేదు అనిపించుకుంది.
విశ్లేషణ :
ఏస్ మూవీ టైటిల్‌కు.. సినిమా కథకు అయితే సంబంధం ఉందని అర్థం అవుతుంది. కానీ ఆ సంబంధం ఏంటి? హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? గతంలో చేసిన నేరాలు ఏంటి? అన్నది తెలియాలంటే మాత్రం కాస్త బుర్రకు పదును పెట్టాల్సిందే. బోల్డ్ కాశీ ఇంట్రో చాలా సింపుల్ గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లైటర్ వే లో సాగిపోతూ ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ , యోగిబాబు కామిడి.. హీరోయిన్ తో పరిచయం, ప్రేమ , ఆమె సమస్య ఇలా నార్మల్ గా కొనసాగుతూ ఉంటుంది. ఇక సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి హీరోయిన్ కు హెల్ప్ చేసే ప్రాసెస్ లో హీరో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు. దాని నుంచి ఎలా బయటపడ్డాడు.. పోలీసులకు పట్టుబడ్డాడా లేదా తప్పించుకున్నాడా .. హీరో బ్యాక్ స్టోరీ ఏంటి అనే కాన్సెప్ట్ మీద సాగుతూ ఉంటుంది. మధ్యలో కథను కాస్త అర్ధం కాకుండా చూపించినట్లు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం శాటిస్ఫై చేస్తుంది. కానీ హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మాత్రం అంత క్లియర్ గా చెప్పలేదు. అది ప్రేక్షకుల ఊహాగానాలకే వదిలేశాడేమో దర్శకుడు. సో ఇక ఈ మూవీ విజయ్ సేతుపతి ఎలాంటి కలెక్షన్స్ తెచ్చి పెడుతుందో చూడాలి.
ప్లస్ లు :
మైనస్ లు:
రేటింగ్ : 3/5
చివరిగా : ‘ఏస్’ రొటీన్ లా అనిపించే భిన్నమైన కథ