Varun Doctor – ఓటిటి వద్దనుకున్నారు – 100 కోట్లకు దగ్గరయ్యారు

తమిళనాడులో థియేటర్లు తెరిచాక ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన శివ కార్తికేయన్ డాక్టర్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటిదాకా 12 రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ ను అందుకోవడం ట్రేడ్ ని సైతం విస్మయపరిచింది. తెలుగులో కేవలం 1 కోటికి పైన కొంత మొత్తానికి బిజినెస్ చేసుకున్న వరుణ్ డాక్టర్ ఆల్రెడీ 2 కోట్ల మార్క్ ని దాటేసి డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చేసింది. మొన్న దసరాకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి, మహా సముద్రంలతో పోటీ పడుతూ పదో రోజు కూడా ఏ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు వేసుకుంది. విజయ్ మాస్టర్ తర్వాత కోలీవుడ్ లో ఆ స్థాయిలో ఘనవిజయం సాధించిన సినిమాగా పొగడ్తల వర్షం కురుస్తోంది.

నిజానికి డాక్టర్ ని కరోనా సెకండ్ లాక్ డౌన్ టైంలో ఓటిటికి ఇవ్వాలని గట్టిగా అనుకున్నారు. కానీ ఎందుకో డీల్ చివరి స్టేజిలో అది వాయిదా పడుతూ వచ్చింది. ఆల్మోస్ట్ అయ్యిందని ఒకసారి లేదు రెండు మూడు రోజుల్లో ప్రకటన వస్తుందని మరోసారి చెన్నై మీడియాలో బాగానే ప్రచారం జరిగింది. ఈ జాప్యం నిర్మాతలకు కలిసి వచ్చింది. వెయిట్ చేసినందుకు తగిన ఫలితాన్ని అందుకున్నారు. డాక్టర్ కు పోటీగా ఇంకే సినిమా లేకపోవడం కూడా బాగా కలిసి వచ్చింది. అందులో కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు మంచి మౌత్ టాక్ ని బయటికి తీసుకెళ్లడంతో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కాగలిగింది. ఇది ఊహించనిది

తమిళ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగులో అంత భీభత్సంగా ఆడటం లేదు కానీ అసలు ఇక్కడ ఇమేజ్ లేని హీరోకి 2 కోట్లు రావడం అంటే మాములు విషయం కాదు. అంతా కలిపి ఇంకో 20 కోట్లు రాబట్టుకోగలిగితే డాక్టర్ వంద కోట్ల మార్కు అందుకుంటాడు. అదేమంత కష్టం కాదు. నవంబర్ 4న సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే వచ్చేదాకా అక్కడి ఆడియన్స్ కి వేరే ఆప్షన్ లేదు. సో ఇంకో పది రోజులు బాక్సాఫీస్ బరి డాక్టర్ దే. కాంపిటీషన్ లేదు కాబట్టి బాలన్స్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. దెబ్బకు డాక్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు విజయ్ తో చేస్తున్న బీస్ట్ అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంతో అతనూ ఉన్నాడు. చూద్దాం

Also Read : Chiranjeevi : చిరు నిర్ణయం వెనుక ఆశలు మతలబు

Show comments