Pithapuram Elections: అవసరం తీరాక వర్మని పక్కన పెట్టారు! ఏరు దాటాక బోడి మల్లన్న రీతిలో!

అవసరం తీరాక వర్మని పక్కన పెట్టారు! ఏరు దాటాక బోడి మల్లన్న రీతిలో!

Pithapuram Elections: నిన్నటి వరకు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల హడావుడి నడిచింది. ఈ ఎన్నికల్లో అందరి చూపు పిఠాపురంపైనే ఉన్నాయి.. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

Pithapuram Elections: నిన్నటి వరకు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల హడావుడి నడిచింది. ఈ ఎన్నికల్లో అందరి చూపు పిఠాపురంపైనే ఉన్నాయి.. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

ఇటీవల రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. ఓడ దాటే వరకు ఓడ మల్లన్నా.. దాటిన తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా ఉన్నాయి. ఎన్నికల ముందు ఎన్నో రకాల హామీలు ఇచ్చే నేతలు తీరా గెలిచిన తర్వాత కనీసం వారి ముఖం కూడా చూపించరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఇబ్బందులు ప్రజలే కాదు.. కొంతమంది పార్టీ నేతలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎంతో కాలంగా పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ టికెట్ ఆశించిన వారికి చివరి నిమిషంలో ఆ టికెట్ మరోకరికి కేటాయించడం జరుగుతుంది. పిఠాపురం ఎమ్మోల్యే అభ్యర్థి విషయంలో అలాంటిదే జరిగింది. కూటమి అభ్యర్థిగా పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని గ్రౌండ్ వర్క్ పూర్త చేసుకున్న వర్మ.. బాబు, పవన్ నిర్ణయంతో త్యాగానికి సిద్దపడ్డారు. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ నిలబడ్డారు. ఇలాలా ఉంటే.. పోలింగ్ పూర్తయిన వెంటనే వర్మ త్యాగాన్ని జనసేన నాయకులు మర్చిపోయారా? అని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక అసలు కారణం ఏంటీ? అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

2014 స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి లక్ష ఓట్ల మెజార్టీ సాధించుకున్న బలమైన నేత వర్మ. ఆ తర్వాత 2019 లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ఈసారి కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగాలని చూశారు. అయితే కూటమి నిర్ణయంతో త్యాగానికి సిద్దపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాన్ ని మనసారా ఆశీర్వదించాలని మీడియా ముందుకు వచ్చారు టీడీపీ నేత వర్మ. ఇంత త్యాగం చేసిన వర్మను జనసేన నాయకులు పక్కన పెట్టారా? అన్న ఆవేదన వర్మ అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే టాక్ వినిపిస్తుంది.

నిన్న పోలింగ్ పూర్తయిన తర్వాత.. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, నేతలు, కార్యకర్తలు వారు చూపించిన ఆదరణ, పడిన కష్టం ఎంతో గొప్పదని నాగబాబు  ఓ లేఖ విడుదల చేశారు.  పట్టణ, వార్డు స్థాయిలో పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచిని వారందరికీ ధన్యవాదాలు.. వారి సేవలు గుర్తిస్తామని చెప్పారు. ఈ సందర్బంగా టీడీపీ నేతల వర్మ గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకు రాలేదు.  మొదటి నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యే సీటులపై గట్టి నమ్మకం పెట్టుకున్న వర్మ కూటమి నిర్ణయంతో  త్యాగం చేశారు. చంద్రబాబు కి ఇచ్చిన మాటకు కట్టుబడి, పవన్ తనపై పెట్టిన నమ్మకం, బాధ్యతకు తలవంచి జనసేన గెలుపు కోసం ఎండా వానా లేక్క చేయకుండా ఎన్నికల ప్రచారం మొదలు కొని పోలింగ్ వరకు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలను కలుపుకొని మయుందుకు సాగారు వర్మ.  ఇంత చేసిన వర్మ పేరు నాగబాబు ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.  ఇలా ఎన్నికలు ముగిశాయి.. అలా వర్మను పక్కన పెట్టారా? అన్న ఆవేదనలో వర్మ అభిమానుల, కార్యకర్తలు ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

పిఠాపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేశారు. ఈ ఏడాది టికెట్ తనకే కేటాయిస్తామని చంద్రబాబు గతంలో వర్మకి మాట ఇచ్చారు. అందుకే ఆయక ఎన్ని కష్టాలు వచ్చినా.. పార్టీని వీడిపోకుండా ఎంతో నమ్మకంతో కొనసాగుతూ వచ్చారు. పార్టీ పటిష్ట పెరిగేలా చేశారు. అలాంటిది చివరి నిమిషంలో పవన్ టీడీపీతో పొత్తులోకి రావడం.. పిఠాపురం ఎమ్మెల్యే స్థానాన్ని కోరుకోవడం జరిగింది. అక్కడ కాపు కులం ఓటు బ్యాంక్ తనకు కలిసి వస్తుందనే గట్టి నమ్మకంతో పవన్ ఆ సీటు ఆశించినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాన్ పోలింగ్ నాడు తన సతీమణితో కలిసి వచ్చి తన ఓటు వేసి వారణాసి వెళ్లిపోయారు. నియోజకవర్గ ప్రజలకు నాగబాబు థ్యాంక్స్ చెప్పారు. ఈ ఎపిసోడ్ లో వర్మ పేరును నాగబాబు ప్రస్తావించకపోవడం పై కొత్త చర్చలు ప్రారంభం అయ్యాయి. ఇప్పడు వర్మ పరిస్థితి ఏరు దాటాకా బోడ మల్లన్నా తీరుగా తయారైందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Show comments