iDreamPost
android-app
ios-app

మేకలను ఢీకొట్టిందని.. ‘వందే భారత్‌’పై రాళ్లదాడి!

మేకలను ఢీకొట్టిందని.. ‘వందే భారత్‌’పై రాళ్లదాడి!

ప్రస్తుతం మన దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల టైమ్ నడుస్తోంది. రోజు రోజూకు వీటికి ప్రజాదరణ పెరిగిపోతుంది. అత్యంత వేగంగా ప్రయాణిచడమే ఈ రైళ్ల ప్రత్యేకత. ఇవి గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలవు. ఇవి ప్రయాణికులకు అత్యంత అనువైన, సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం కోసం రూపొందించినవి. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే తరచూ ఈ రైళ్లపై దాడులు జరుగుతున్నాయి. గతంలో వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి జరగ్గా.. తాజాగా మరోసారి  అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఉత్తర్‌ప్రదేశ్‌లో గోరఖ్ పూర్ నుంచి లఖ్ నవూకు వందే భారత్ రైలు బయలు దేరింది. మార్గం మధ్యలో సోహవాల్ అనే ప్రాంతానికి చేరుకునే సరికి ముగ్గురు వ్యక్తులు రైళ్లపైకి రాళ్లు విసిరారు.  దీంతో పలు కోచ్ ల అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. అలానే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్  చేశారు. ఇక వందేభారత్ రైలుపై దాడి ఘటనకు గల కారణాలను పోలీసులు వివరించారు. ‘ఆదివారం గోరఖ్ పూర్- లఖ్ నవు మార్గంలో ఉన్న రైల్వేట్రాక్‌పై నన్హు పాసవాన్‌ అనే వ్యక్తికి చెందిన మేకలు గడ్డి మేస్తున్నాయి. అదే సమయంలో వందేభారత్‌ రైలు ఢీకొని మేకల మందను ఢీ కొట్టింది.

దీంతో ఆ అధిక సంఖ్యలో మేకలు మృతి చెందాయి. దీనిపై ఆగ్రహంగా ఉన్న మేకల యజమాని పాసవాన్‌, అతని ఇద్దరు కుమారులు మరుసటి రోజు ఉదయం.. అటుగా వస్తున్న వందే భారత్ రైలుపై  రాళ్లు విసిరారు’ అని రైల్వే పోలీసులు వివరించారు. వందే భారత్ రైలు గతంలోనూ ఆవులను, ఎద్దులను ఢీ కొట్టిన ఘటనలు జరిగాయి.  అలానే పలు సందర్భాల్లో ఆకతాయిలు ఈ రైలుపై రాళ్ల దాడులు కూడా చేశారు.  అయితే  ఇలాంటి ఘటనలను నిర్మూలించేందుకు ఎప్పటికప్పుడు రైల్వే శాఖ చర్యలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. మరి.. ఇలా వందే భారత్ రైళ్లు మూగజీవాలను ఢీ కొట్టడంపై, రాళ్ల దాడుల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది చదవండివీడియో: ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ అరుదైన ఫీట్.. గంట పాటు నీటిపై..!