iDreamPost
iDreamPost
కరోనా సెకండ్ వేవ్ పుణ్యమాని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పట్టుమని నాలుగో వారంలోకి అడుగుపెట్టకుండానే సెలవు తీసుకున్నాడు. థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ ఓటిటికి వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది కానీ వాటిని స్టడీగా నిలబెట్టుకుని ఫైనల్ గా లాభాలను మిగల్చలేకపోయింది. సుమారు 90 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న వకీల్ సాబ్ షేర్ రూపంలో దానికి దగ్గరగా వెళ్ళింది కానీ టార్గెట్ ని మాత్రం దాటలేక మిడిల్ డ్రాప్ అయ్యింది. రెండో వారం నుంచే కోవిడ్ తాలూకు ప్రభావం మొదలుకావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోమేటిక్ గా హాళ్లకు దూరంగా ఉన్నారు. ఈ ఫ్యాక్టర్ చాలా దెబ్బ తీసింది.
ప్రైమ్ లో గత నెల 30న స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటన రాగానే కొన్ని కేంద్రాల్లో రన్ లో ఉన్న వకీల్ సాబ్ కి పూర్తిగా సెలవు ఇచ్చేశారు ఎగ్జిబిటర్లు. అక్కడక్కడా సింగల్ డిజిట్ కౌంట్ థియేటర్లలో ఉన్నప్పటికీ నామమాత్రం వసూళ్లు కూడా రావడం లేదు. అయితే ఒక రీమేక్ సినిమాకు 136 కోట్ల దాకా గ్రాస్ రావడం అనేది మాత్రం చిన్న విషయం కాదు. పవన్ ఇమేజ్ ఇక్కడ ఎక్కువగా పని చేసినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు ఎక్కువగా లేకపోయినా ఇంత స్థాయిలో కలెక్ట్ చేయడం గొప్ప విశేషమే. ఇతర హీరోలతో ఈ ఫిగర్స్ సాధ్యమయ్యుండేవి కావేమో. ఏరియాల వారీగా లెక్క ఈ విధంగా ఉన్నాయి
వకీల్ సాబ్ ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా | షేర్ |
నైజాం | 25.01cr |
సీడెడ్ | 12.89cr |
ఉత్తరాంధ్ర | 11.71cr |
గుంటూరు | 7.12cr |
క్రిష్ణ | 5.01cr |
ఈస్ట్ గోదావరి | 6.49cr |
వెస్ట్ గోదావరి | 7.01cr |
నెల్లూరు | 3.39cr |
ఆంధ్ర+తెలంగాణా | 78.63cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 3.66cr |
ఓవర్సీస్ | 3.81cr |
ప్రపంచవ్యాప్తంగా | 86.10cr |
పైకి ఫిగర్లు నష్టాన్ని సూచిస్తున్నప్పటికీ అధిక ప్రాంతాల్లో వకీల్ సాబ్ లాభాలను ఇచ్చాడు. అయితే ఓవర్సీస్ లో మాత్రం నష్టం తప్పలేదు. పింక్, నీర్కొండ పార్వైని అక్కడి ఆడియన్స్ ఆల్రెడీ చూసేసి ఉండటం ఎఫెక్ట్ ఇచ్చింది. దానికి తోడు కరోనా వార్తలు ప్రేక్షకులను భయపెట్టాయి. ఇది గుర్తించే నిర్మాత దిల్ రాజు సేఫ్ గా ప్రైమ్ తో డీల్ మార్చేసుకుని త్వరగా స్ట్రీమింగ్ చేసుకోవడానికి పచ్చ జెండా ఊపేశాడు. ఒకవేళ లాక్ డౌన్ రాకుండా పరిస్థితి నార్మల్ గా ఉంటే వకీల్ సాబ్ మరో అయిదారు కోట్ల దాకా ఈజీగా రాబట్టేదని ట్రేడ్ అంచనా. అదే జరిగి ఉంటే బ్రేక్ ఈవెన్ దాటేసి కంప్లీట్ సేఫ్ అయ్యేది. కానీ ఛాన్స్ మిస్
Verdict: HIT