iDreamPost
android-app
ios-app

Vajram : అక్కడ మెరిసిన వజ్రం ఇక్కడ కరిగింది – Nostalgia

  • Published Nov 29, 2021 | 12:09 PM Updated Updated Nov 29, 2021 | 12:09 PM
Vajram : అక్కడ మెరిసిన వజ్రం ఇక్కడ కరిగింది – Nostalgia

క్రేజీ కాంబోలు ఎప్పుడూ బ్లాక్ బస్టర్స్ ఇస్తాయన్న గ్యారెంటీ లేదు. హీరో ఎవ్వరైనా సరే కంటెంట్ ముఖ్యం. ఒక స్టార్ ఇమేజ్ ఓపెనింగ్స్ కి గ్యారెంటీ ఇస్తుంది కానీ లాంగ్ రన్ దక్కాలంటే మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మద్దతు ఉండాల్సిందే. అది జరగకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 1995కు ముందు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి మార్కెట్ మాములుగా లేదు. మీడియం రేంజ్ హీరోలతో ఆయన చేసిన కామెడీ చిత్రాలు, శుభలగ్నం లాంటి అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాలు ఎస్వి బ్రాండ్ ని ఎక్కడో ఆకాశంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాయి . సహజంగానే అగ్ర హీరోల చూపు ఇలాంటి వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు వచ్చిన ఆఫర్లలో మొదటిది బాలకృష్ణది.

రెండోది నాగార్జున. నిజానికి ఈ కాంబినేషన్ లో ఎస్వి కృష్ణారెడ్డి ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం రాలేదు.ఆ టైంలో మలయాళంలో రిలీజైన మోహన్ లాల్ స్పడిగం గురించి తెలిసింది. భద్రన్ డైరెక్షన్లో రూపొందిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కేరళలో బ్లాక్ బస్టర్ అయ్యింది. 5 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. బోలెడు అవార్డులు కూడా వచ్చాయి. ఇది మనవాళ్లకూ కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో నిర్మాత గౌతమ్ కుమార్ రెడ్డి హక్కులను కొనేసి కృష్ణారెడ్డి ముందు రీమేక్ ప్రతిపాదన పెట్టారు. నాగార్జునకూ ఒరిజినల్ వెర్షన్ నచ్చేసింది. అంతే వజ్రంకు శ్రీకారం చుట్టారు. రోజాని హీరోయిన్ గా తీసుకుని ఇంద్రజతో స్పెషల్ సాంగ్ చేయించారు. దివాకర్ బాబు సంభాషణలు, శరత్ ఛాయాగ్రహణం సమకూర్చారు.

కీలకమైన తండ్రి పాత్రకు కళాతపస్వి కె విశ్వనాథ్ ఒప్పుకున్నారు. చిన్నప్పుడు చదువు అబ్బని కొడుకు, అతని మీద ద్వేషం పెంచుకున్న నాన్న మధ్య ఎమోషన్స్ ప్రధానంగా తీసుకుని గ్యాంగ్ స్టర్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దిన తీరు మన ఆడియన్స్ కి నచ్చలేదు. ప్రతి అంశం ఓవర్ ది బోర్డు అనిపించడంతో అంచనాలు అందుకోలేకపోయింది. 1996 జనవరి 5న వంశానికొక్కడుతో పాటు విడుదలైన వజ్రం డిజాస్టర్ అయ్యింది. బాలయ్య మూవీ హిట్టయ్యింది. అయితే అదే నెల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన శ్రీకాంత్ పెళ్ళిసందడి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఫైనల్ ట్విస్ట్. వారం గ్యాప్ లో వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి మరో సినిమా సంప్రదాయం కూడా ఫెయిల్ అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ ఉన్నప్పటికీ ఇది సైతం అంచనాలు అందుకోలేక ఫ్లాప్ ముద్ర వేయించుకుంది

Also Read : Vedam : సమాజపు చీకటి మనసులకు దర్పణం – Nostalgia