iDreamPost
android-app
ios-app

చంద్రబాబువి నిస్సిగ్గు రాజకీయాలు … తూర్పారబట్టిన మాజీ మంత్రి

చంద్రబాబువి నిస్సిగ్గు రాజకీయాలు … తూర్పారబట్టిన మాజీ మంత్రి

స్వల్ప కాలంలోనే తన రాజకీయ విధానాలను మార్చుకునే స్వభావం ఉన్న చంద్రబాబు.. తన వైఖరిని కొనసాగించారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి బీజేపీపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో స్నేహం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తన పార్టీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. తాజా జరిగిన జూమ్‌ మహానాడులో బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తామంటూ తీర్మానం చేశారు.

చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీ నేతగా, ఆ పార్టీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసి, ప్రస్తుతం రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్న శోభనాద్రీశ్వరరావు చంద్రబాబు తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఏం చూసి మద్ధతు ఇస్తున్నారు..?

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎలా మద్ధతు తెలుపుతారని వడ్డే సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ కల్పించిన హక్కులను, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మద్ధతుగా ఉంటామని తీర్మానం చేయడం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమంటూ వడ్డే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అది క్షమించరాని తప్పు..

బీజేపీ ప్రభుత్వం పట్ల చంద్రబాబు అవలంభిస్తున్న రాజకీయ విధానాలపై వడ్డే విరుచుకుపడ్డారు. 2018–19 మ«ధ్య బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని అతిగా విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేకత, రైతాంగ వ్యతిరేక విధానాలపై చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడకపోవడం క్షమించరాని తప్పు అని చంద్రబాబు తీరును వడ్డే తూర్పారపట్టారు. వ్యవసాయ నల్ల చట్టాలపై చంద్రబాబు మాట మాత్రమైనా మాట్లాడలేదంటూ తప్పుబట్టారు.

స్వార్థరాజకీయం..

ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించి.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎన్టీఆర్‌ ఎండగట్టారు. నాడు ఎన్టీఆర్‌ చూపించిన ఆత్మగౌరవ పంథాను సంకుచితమైన, స్వార్థ రాజకీయ, స్వప్రయోజనాల కోసం మహానాడులో నిస్సిగ్గుగా విడనాడడం దురదృష్టకరమని వడ్డే చంద్రబాబు తీరును ఎండగట్టారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా మోసం చేసిన మోడీకి మద్ధతు ఇచ్చే విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలని హితవుపలికారు. రైతాంగ సమస్యలు, హక్కులపై పోరాడుతున్న వడ్డే.. చంద్రబాబు తీరును ఈ స్థాయిలో ధ్వజమెత్తడం టీడీపీలో చర్చనీయాంశమవుతోంది. మొన్న సీపీఐ రామకృష్ణ, నేడు వడ్డే.. ఈ జాబితాలో చంద్రబాబు సన్నిహితులు ఇంకెంత మంది చేరతారో వేచి చూడాలి. 

Also Read : నేనేం తప్పు చేశానో అర్థం కావడం లేదు.. ప్రజలు నన్ను అర్థం చేసుకోలేదు.. చంద్రబాబు ప్రవచనాలు