వారసుడు మీద సోషల్ మీడియా మీమ్స్

నిన్న విడుదలైన వారసుడు ట్రైలర్ సోషల్ మీడియా మీమర్స్ కి పెద్ద పనే అప్పజెప్పింది. తమిళనాట భారీ హైప్ తో రిలీజవుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా మీద తెలుగులో పెద్దగా అంచనాలు లేవు కానీ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల తమ హీరోల సినిమాలకు థియేటర్ల తగ్గిపోతున్నాయని చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆల్రెడీ ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి కన్నూ దీని మీదే ఉంది. దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరోయిన్ రష్మిక మందన్న, తమన్ పాటలు, జయసుధ సుమన్ శ్రీకాంత్ లాంటి టాలీవుడ్ క్యాస్టింగ్ వెరసి దీని మీద మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. మరి తప్పెక్కడ జరిగింది

కథాపరంగా ఏ మాత్రం కొత్తదనం లేనట్టుగా ఫీలవ్వడమే ఈ పరిస్థితికి కారణం. శరత్ కుమార్ లాంటి ఓ బడా బిజినెస్ మెన్ కి ముగ్గురు కొడుకులు ఉంటే అందులో చిన్నవాడు బయట జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. శత్రువు ప్రకాష్ రాజ్ రూపంలో వచ్చి వీళ్ళ వ్యాపారానికి చెక్ పెట్టడమే కాక ఏకంగా కుటుంబాన్ని విడదీస్తాడు. అప్పటిదాకా జీవితాన్ని ఆస్వాదించడమే పనిగా పెట్టుకున్న చివరి తమ్ముడు రంగంలోకి దిగి కంపెనీని, ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను ఎదురుకోవడం తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో విజయ్ ఏం చేస్తాడు అనేది సగటు ఫార్ములా స్టైల్ లో వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది

దీంతో వారసుడు కాస్తా ట్విట్టర్ ఫేస్ బుక్ కి లక్ష్యంగా మారిపోయాడు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, వెంకటేష్ లక్ష్మి, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, మహేష్ బాబు మహర్షి, జూనియర్ ఎన్టీఆర్ బృందావనం, నవదీప్ గౌతమ్ SSC ఇలా అన్ని సినిమాల ఛాయలు ఇందులో ఉన్నాయని ఓ రేంజ్ లో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇది ఎంత రెగ్యులర్ ఎంటర్ టైనర్ అయినా విజయ్ ఇమేజ్ కి పొంగల్ బరిలో స్వంత రాష్ట్రంలో ఈజీగా పబ్లిక్ ని ఫ్యాన్స్ ని లాగేస్తుంది. ఎటొచ్చి మన జనం ఇలాంటివి బోలెడు చూశారు కాబట్టి ఏ మేరకు ఆదరిస్తానేది సినిమా చూశాక క్లారిటీ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంతగా టార్గెట్ అయిన విజయ్ మూవీ ఇదే

Show comments