‘ఆహా’ నాని – షాక్ ‘వి’స్తారా ?

ఇంకా తెలుగులో ఓటిటి ప్రకంపనలు మొదలుకాలేదా అనుకుండగానే ఆ దిశగా అడుగులు కాస్త గట్టిగానే పడబోతున్నట్టు సమాచారం. నిన్నటి దాకా అనుష్క నిశబ్దం మాత్రమే స్ట్రెయిట్ డిజిటల్ రిలీజ్ ఉంటుందన్న వార్త ఖరారు కాక ముందే ఇప్పుడు నాని వి లైన్ లోకి వచ్చేసింది. తాజా అప్ డేట్ ప్రకారం అల్లు అరవింద్ సంస్థ ఆహా ‘వి’ని భారీ మొత్తానికి కొనుగోలు చేసి త్వరలో వరల్డ్ ప్రీమియర్ గా వేయబోతున్నట్టు వినికిడి. ఇది అధికారికంగా చెప్పింది కాదు కాని ఫిలిం నగర్ టాక్ అయితే చాలా జోరుగా ఉంది.

థియేటర్లు తెరచుకోవడం గురించి ఇప్పటికీ అస్పష్టత కొనసాగడంతో పాటు తమకు ఇది చివరి ప్రాధాన్యమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇటీవలే పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన వి క్రైమ్ జానర్ లో రూపొందింది. లాక్ డౌన్ కు చాలా రోజుల ముందే ట్రైలర్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది కూడా. దిల్ రాజు ఇక వేచి చూడటం వల్ల లాభం లేదని గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఎంత మొత్తంలో డీల్ జరిగిందన్నది మాత్రం బయటకు రాలేదు. ఆహాకు ఇప్పటిదాకా బలమైన బూస్ట్ అప్ లేదు.

ఎంత బోల్డ్ వెబ్ సిరీస్ లు అందించినా స్పందన మరీ గొప్పగా లేదు. కొత్త సినిమాలు కూడా చెప్పుకోదగ్గవి రాలేదు. ఒక్క కనులు కనులు దోచాయంటే మాత్రమే ఎనర్జీని ఇచ్చింది. ఈ నేపధ్యంలో సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగాలంటే ఏదో అద్భుతం జరగాలి. అందుకే నాని వికి ఊహించని రీతిలో పెట్టుబడి పెట్టినట్టు టాక్. ఇది నిజమో కాదో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నాని కూడా అంగీకారం తెలిపాడట. ఒకవేళ వాస్తవమైతే మాత్రం టాలీవుడ్ లో ఇదో సెన్సేషన్ అవుతుంది. ఒక పక్క మల్టీ ప్లెక్సుల యాజమాన్యాలు ఇలా చేస్తున్న నిర్మాతల పట్ల బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. కోలీవుడ్, బాలీవుడ్ తో మొదలై మెల్లగా ఈ ట్రెండ్ టాలీవుడ్ కు వచ్చేసింది. ఇంకెన్ని పరిణామాలు చూడాలో. లెట్ వెయిట్ అండ్ సి

Show comments