iDreamPost
android-app
ios-app

ఆ బస్సులో ప్రయాణీకులే కాదూ.. డ్రైవర్లు, కండక్టర్లు కూడా మహిళలే

ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు అని చూసే రోజుల నుండి.. ఏ రంగంలోనైనా మగవాళ్లకు దీటుగా దూసుకెళ్లగలరు అని నిరూపించుకునే రోజులకు అతివలు చేరారు. అన్ని రంగాల్లో కన్నా టఫ్ అనిపించే మోటార్ ఫీల్డ్ లోకి వస్తున్నారు నారీమణులు. వారికి అవకాశం కల్పిస్తుంది ఆ ప్రభుత్వం..

ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు అని చూసే రోజుల నుండి.. ఏ రంగంలోనైనా మగవాళ్లకు దీటుగా దూసుకెళ్లగలరు అని నిరూపించుకునే రోజులకు అతివలు చేరారు. అన్ని రంగాల్లో కన్నా టఫ్ అనిపించే మోటార్ ఫీల్డ్ లోకి వస్తున్నారు నారీమణులు. వారికి అవకాశం కల్పిస్తుంది ఆ ప్రభుత్వం..

ఆ బస్సులో ప్రయాణీకులే కాదూ.. డ్రైవర్లు, కండక్టర్లు కూడా మహిళలే

నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళుతున్నారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ.. వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడమే కాకుండా, కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు మహిళలు. ఇటీవల కాలంలో నారీ శక్తి బాగా వృద్ధి చెందింది. ఒకప్పుడు అనర్హులుగా భావించే సైన్యంలోకి ఇప్పడిప్పుడే వడివడిగా అడుగులు పడుతున్నాయి. అలాగే ఎన్నో ఏళ్ల కల.. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల చేసిన బిల్లు కూడా ఆమోదం పొందిన సంగతి విదితమే. తాము కన్న కలలను సాకారం చేసుకుంటున్నారు అతివలు.

అలాగే మహిళలకు పెద్ద పీట వేస్తున్నాయి ఆయా రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్న పార్టీలు. బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నాయి కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగాలు కూడా కల్పిస్తోంది ఉత్తరప్రదేశ్‌లోని యోగీ సర్కార్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో మహిళలకు ఉద్యోగాలు కల్పించింది యుపి సర్కార్. కేవలం కండక్టర్లనే కాదూ.. డ్రైవర్లుగా కూడా ఆడవాళ్లనే నియమించింది. దుర్గాష్టమిని పురస్కరించుకుని మిషన్ మహిళా సారధి అనే పథకంలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం అయోధ్యలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 51 కొత్త బస్సులకు జెండా ఊపారు సీఎం.

ఈ బస్సులను ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు. ప్రయాణీకులు మాత్రమే మహిళలు కాదూ..డ్రైవర్లు, కండక్లరను నియమించగా.. వీరంతా నారీమణులే కావడం విశేషం. మహిళలు అన్ని రంగాల్లో రాణించలేరన్న అభిప్రాయం తప్పని నిరూపించేందుకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. పోలీసు, ఇతర శాఖల్లో 1.5 లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మహిళ డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తున్నామని చెప్పారు. ఈ లెక్క ప్రకారం నిజమైన లేడీస్ స్పెషల్ బస్సులు అన్నమాట. మహిళలకు ప్రత్యేక బస్సులు కేటాయించడంపై అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.