iDreamPost
android-app
ios-app

ఉస్తాద్ భగత్ సింగ్ ఆఖరి దశకు.. నెక్స్ట్ ప్లాన్ ఏంటి !

  • Published Jul 29, 2025 | 1:26 PM Updated Updated Jul 29, 2025 | 1:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. రాజకీయాల కారణంగా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలియనిది కాదు. ఆ తర్వాత ఒక్కసారి సెట్ లోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ పెండింగ్ సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు రిలీజ్ అయిన సంగతి తెల్సిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. రాజకీయాల కారణంగా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలియనిది కాదు. ఆ తర్వాత ఒక్కసారి సెట్ లోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ పెండింగ్ సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు రిలీజ్ అయిన సంగతి తెల్సిందే.

  • Published Jul 29, 2025 | 1:26 PMUpdated Jul 29, 2025 | 1:26 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ఆఖరి దశకు.. నెక్స్ట్ ప్లాన్ ఏంటి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. రాజకీయాల కారణంగా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలియనిది కాదు. ఆ తర్వాత ఒక్కసారి సెట్ లోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ పెండింగ్ సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. ఇక సెప్టెంబర్ లో ఓజి సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓ పక్క ఈ సినిమాల ఉండనే ఉండగా.. మరో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అప్డేట్స్ మొదలెట్టేసారు. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా సినిమా అప్డేట్ అనౌన్స్ చేసింది. లేటెస్ట్ గా జరిగిన షెడ్యూల్ లో దాదాపు క్లైమాక్స్ పార్ట్ కంప్లీట్ అయిందట.

నిజానికి ఈ సినిమా గురించి ఇప్పట్లో పెద్దగా అంచనాలు ఏమి లేవు. ఎందుకంటే ఆల్రెడీ హరి హర వీరమల్లు ఇచ్చిన వైబ్ లోనే ఉన్నారు అభిమానులు. మరో వైపు ఓజి ఫీవర్ ఎప్పటినుంచో ఉండనే ఉంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం అయినా పర్లేదని అనుకున్నారు. కానీ తీరా చూస్తే హరీష్ శంకర్ జెట్ స్పీడ్ లో మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తేరి సినిమా రీమేక్ గా మొదలైందట.. కానీ తర్వాత స్ట్రెయిట్ సబ్జెక్టు గానే మారిందని ఇన్సైడ్ టాక్. దీనిలో ఎంతవరకు నిజం ఉందో సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. అయితే మేజర్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ గా ఫ్రెష్ ట్రీట్మెంట్ తోనే ఉంటుందని.. ఫ్యాన్స్ కు పూనకాలు కన్ఫర్మ్ అని మేకర్స్ ఊరిస్తున్నారు.

హరీష్ స్పీడ్ చూస్తూనే నవంబర్ కు ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి కాపీ రెడీ అయ్యేలానే కనిపిస్తుంది. ఇప్పటికవరకు అయితే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎలాగూ తీసుకున్న ఈ మధ్య అవి చెప్పిన టైం కు రావడం లేదు. సో అభిమానులనుకు కూడా ఆ విషయం మీద ఎలాంటి అభ్యతరం లేదు. సో ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.