iDreamPost
android-app
ios-app

అవతార్ 3 లో భారీ విజువల్ వండర్ గ్యారెంటీ..

  • Published Jul 29, 2025 | 12:51 PM Updated Updated Jul 29, 2025 | 12:51 PM

అవతార్ 1 , 2 ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేశాయో తెలియనిది కాదు. ప్రేక్షకులతో పాటు అటు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను కూడా తిరగరాసింది ఈ సినిమా. దీనితో ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లోని మూడు భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

అవతార్ 1 , 2 ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేశాయో తెలియనిది కాదు. ప్రేక్షకులతో పాటు అటు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను కూడా తిరగరాసింది ఈ సినిమా. దీనితో ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లోని మూడు భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

  • Published Jul 29, 2025 | 12:51 PMUpdated Jul 29, 2025 | 12:51 PM
అవతార్ 3 లో భారీ విజువల్ వండర్ గ్యారెంటీ..

అవతార్ 1 , 2 ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేశాయో తెలియనిది కాదు. ప్రేక్షకులతో పాటు అటు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను కూడా తిరగరాసింది ఈ సినిమా. దీనితో ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లోని మూడు భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను బట్టి సినిమా ఎలా ఉంటుందో చెప్పేయొచ్చు. అవతార్ 3 లోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు విజువల్ వండర్ ట్రీట్ ను ఇవ్వడం ఖాయం. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా భారీ రెస్పాన్స్ రావడం విశేషం.

అవతార్ మొదటి పార్ట్ లో పండోరా గ్ర‌హం అడ‌వుల్లో నివ‌సించే జాతి గురించి చూపించారు.. ఇక రెండో భాగంలో నీటిలో ఉండే అదే జాతి ఆధారంగా సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు మూడో భాగం ఈ రెండిటిని మించి ఫైర్ అనే కోణంలో రూపొందించారు. ట్రైలర్ ను గమనిస్తే ప్రతి ఫ్రేమ్ లోని జేమ్స్ క‌మ‌రూన్ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇందులో కొత్తగా కొన్ని ఎమోషనల్ కోణాలను అద్భుతంగ చూపించారు. అంతే కాకుండా ఫైర్ నేషన్ లీడర్ గా కొత్త విలన్ ను ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలా ట్రైలర్ చూస్తూనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటిలో ఇలాంటి విజువల్స్ ను కొట్టే సినిమా రాదనీ.. ఒకవేళ వస్తే మళ్ళీ అది అవతార్ 4 మాత్రమే అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గ్రాఫిక్స్అంటే కామ‌రూన్ త‌ర్వాతే ఎవ‌రైనా అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబ‌ర్ 19న థియేట‌ర్ల‌లోకి అడుగుపెట్టనుంది. సుమారు 160 పైకి భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 2029 లో అవతార్ 4 , 2031 లో అవతార్ 5 లాస్ట్ మూవీని రిలీజ్ చేసి ఈ ఫ్రాంచైజ్ ను క్లోజ్ చేయనున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఇక ఇప్పుడు అవతార్ 3 ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.