iDreamPost
android-app
ios-app

OG vs అఖండ-2 కాదిది.. అమెజాన్ vs నెట్ ఫ్లిక్స్ !

  • Published Jul 29, 2025 | 10:31 AM Updated Updated Jul 29, 2025 | 10:31 AM

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో చాలా వరకు సినిమాలు చెప్పిన సమయానికి రిలీజ్ అయినా దాఖలాలు లేవు. కొన్ని సినిమాలైతే రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా సినిమాల మీద ఇంకా బజ్ తగ్గిపోతుంది అనుకునే సమయానికి అప్పుడు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రావడం స్టార్ట్ అవుతుంది.

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో చాలా వరకు సినిమాలు చెప్పిన సమయానికి రిలీజ్ అయినా దాఖలాలు లేవు. కొన్ని సినిమాలైతే రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా సినిమాల మీద ఇంకా బజ్ తగ్గిపోతుంది అనుకునే సమయానికి అప్పుడు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రావడం స్టార్ట్ అవుతుంది.

  • Published Jul 29, 2025 | 10:31 AMUpdated Jul 29, 2025 | 10:31 AM
OG vs అఖండ-2 కాదిది.. అమెజాన్ vs  నెట్ ఫ్లిక్స్ !

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో చాలా వరకు సినిమాలు చెప్పిన సమయానికి రిలీజ్ అయినా దాఖలాలు లేవు. కొన్ని సినిమాలైతే రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా సినిమాల మీద ఇంకా బజ్ తగ్గిపోతుంది అనుకునే సమయానికి అప్పుడు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గత కొద్దీ రోజులుగా ఓజి vs అఖండ 2 రిలీజ్ డేట్స్ మీద గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒకటే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. హరి హర వీరమల్లు ఈ నెలలోనే రిలీజ్ అయింది కాబట్టి ఓజి వెనక్కు తగ్గే అవకాశం ఉందని కొందరు… సినిమాలో ఇంకా కొంత భాగం షూట్ బ్యాలన్స్ ఉందని అఖండ 2 పోస్ట్ పోన్ అవుతుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు తాజాగా అఖండ 2 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులు లేవని .. తాము రెడీ గా ఉన్నామని బోయపాటి క్లారిటీ ఇచ్చేశారు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసేది.. నిర్మాతలు , డైరెక్టర్స్ కాదు ఓటిటి సంస్థలు. అఖండ 2 ఓటిటి హాక్క్కుల విషయాల్లో ప్రస్తుతం డీలింగ్స్ జరుగుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుంది.. నిర్మాతలు కూడా దాదాపు ఒకే చెప్పేలానే ఉన్నారు. కానీ ఇక్కడో ఓ చిక్కు ఉంది.. సెప్టెంబర్ నెలలో అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన కాంతారా ప్రిక్వెల్ రిలీజ్ కు రెడీగా ఉంది. సో అఖండ 2 ని అమెజాన్ కొనుగోలు చేస్తే మాత్రం సెప్టెంబర్ లో ఈ సినిమా రానట్లే.

ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే.. ఓజి సినిమాను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఆల్రెడీ స్లాట్ కూడా కన్ఫర్మ్ చేసుకుంది అటు ఓజి నిర్మాతలు కూడా సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఓజి వెనక్కు తగ్గితే.. అప్పుడు నెట్ ఫ్లిక్ల్స్ కు ఓ సినిమా అవసరం అవుతుంది. ఈ క్రమంలో అఖండ 2 ఓటిటి హక్కుల నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటే.. ఈ సినిమా సెప్టెంబర్ లోనే వచ్చే అవకాశం ఉంది. సో ఓజి వెనక్కు తగ్గితే సెప్టెంబర్ లో అఖండ 2 వస్తుంది. లేదంటే డిసెంబర్ కు వెళ్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.