ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరీ ముఖ్యంగా కృష్ణాజిల్లా ప్రస్తావన రాగానే పామర్రు నియోజకవర్గానికి మంచి ప్రాధాన్యత ఉంది. నిజానికి 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి వరకు నిడుమోలు నియోజకవర్గంగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని రద్దు చేస్తూ పామర్రు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.. అప్పటి జనాభా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. పామర్రు సహా పమిడిముక్కల, తోట్లవల్లూరు, మొవ్వ, పెదపారుపూడి మండలాలతో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ని ఏర్పాటు చేశారు. 2009 తర్వాత మూడు సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అందులో ఒకసారి కాంగ్రెస్ విజయం సాధించగా రెండు సార్లు వైయస్సార్ కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం.
నిజానికి నిడుమోలు నియోజకవర్గం ఉన్నప్పుడు ఒక రకంగా ఆ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. అక్కడి నుంచి సీపీఎం నేత పాటూరు రామయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా కాంగ్రెస్ నేత కనుమూరి సోమేశ్వరరావు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే ఎన్టీఆర్ రంగప్రవేశం చేసి టీడీపీ స్థాపించిన తర్వాత కూడా ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు మాత్రమే తెలుగుదేశం గెలిచింది. ఎక్కువ సార్లు టీడీపీ మిత్రపక్షంగా సిపిఎం కు పోటీ చేసే అవకాశం దక్కింది.
2009లో రద్దయిన నిడదవోలు నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరగగా ఆరుసార్లు సిపిఎం, రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి సిపిఐ గెలుపొందాయి. 2009లో పామర్రు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డీవై దాస్ రంగంలోకి దిగి అప్పటి తెలుగుదేశం అభ్యర్థి ఉప్పులేటి కల్పన మీద గెలుపొందారు. అప్పటి నుంచే తెలుగుదేశంలో కొనసాగుతూ వచ్చిన ఉప్పులేటి కల్పన సరిగ్గా 2014 ఎన్నికలకు కొన్నాళ్ల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకుని వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వర్ల రామయ్య మీద గెలుపొందారు.
Also Read : ప్రజా సమస్యలపై నోరువిప్పలేని పరిస్థితి చంద్రబాబుకు ఎందుకు వచ్చింది..?
అయితే అధికారంలోకి టీడీపీ రావడంతో రెండేళ్ల పాటు ప్రతిపక్ష నేత జగన్ వెంట నడిచిన ఉప్పులేటి కల్పన ఒకరకంగా ఆయనకు వెన్నుపోటు పొడిచి 2016లో మళ్లీ తన సొంత గూటికి చేరారు. బహుశా ఏవైనా కులాల లెక్కల్లో ఆమె తనకు మంత్రి పదవి లభించవచ్చు అని భావించి ఉండవచ్చు.కానీ 2016 నుంచి 2019 వరకు అధికార పార్టీలో పనిచేసిన ఆమెకు పదవులు దక్కిన దాఖలాలు లేవు.
2019 ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చినా వైఎస్ జగన్ హవా ముందు నిలబడలేక పోయింది. వైసీపీ నుంచి అభ్యర్థిగా నిలబడిన కైలే అనిల్ కుమార్ దెబ్బకు ఓటమిపాలవక తప్పలేదు. నిజానికి 2014 ఎన్నికల్లో ఉప్పులేటి కల్పన వర్ల రామయ్య మధ్య ఓటింగ్ పెద్దగా తేడా లేదు. కానీ 2019 ఎన్నికల్లో ఆమెకు ఏకంగా కైలే అనిల్ కుమార్ కంటే 30 వేల తక్కువ ఓట్లు పోలయ్యాయి. నిజానికి ముందు నుంచి చంద్రబాబుతో నడుస్తూ వచ్చిన ఉప్పులేటి కల్పన ఒక్కసారి పార్టీ మారి పోటీ చేసినప్పుడు జగన్ సొంత మనిషిగా ఆదరించారు. కానీ ఆమె వెంటనే పార్టీ మరి అప్పటి తమ నేతకు చేసిన ద్రోహం దెబ్బకు ఆమె భారీగా నష్టపోవాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి.
నిజానికి అప్పుడు ఆమె పార్టీ మారడానికి ఆమె భర్త ఉద్యోగం ఒక కారణం, అని అంటూ ఉంటారు. ఆమె భర్త ఉప్పులేటి దేవీప్రసాద్ 34 ఏళ్ళపాటు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహించారు, అప్పట్లో ఆయన ఇన్కమ్ టాక్స్ కమిషనర్ గా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం కల్పన మీద ఒత్తిడి చేసిందని, ఆ ఒత్తిడి తట్టుకోలేక టికెట్ ఇచ్చిన జగన్, ఇప్పించిన కొడాలి నానిని మోసం చేసి టీడీపీలోకి వెళ్ళిన పరిస్థితి. ఏదైతేనేమి సరిగ్గా ఎన్నికల ముంచు భర్త పదవీకాలం ముగియడంతో ఆయన కూడా టీడీపీలో చేరారు.
అయితే టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉప్పులేటి కల్పన బయటకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆమె బయటకు రాకుంటే దేవి ప్రసాద్ మాత్రం వచ్చి ఏం చేస్తారు? ఒక రకంగా తెలుగుదేశం నేతలు చాలామంది ఇప్పుడు ఇళ్లకే పరిమితం అవుతుండగా వారి జాబితా లోని ఉప్పులేటి కల్పన కూడా చేరి కేవలం పత్రికా ప్రకటనలకు, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడానికి పరిమితమవుతున్నారు..
ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యువకుడు కావడంతో పాటు నియోజకవర్గం మీద పట్టు ఉండడంతో ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కల్పన అసలు బయటకు వస్తారో ? రారో ? తెలియని పరిస్థితి. నిజానికి ఆమె జగన్ కి ద్రోహం చేసి పార్టీ వీడకుండా ఉండి ఉంటే ఈపాటికి పామర్రు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి మంత్రి కూడా అయి ఉండేదని విశ్లేషకుల భావన. ఆమె చేసిన ఆ ఒక్క ద్రోహమే ఆమె రాజకీయ జీవితానికి సమాధి కట్టినట్టయింది
Also Read : దాడిశెట్టి రాజా ఆశలు పండేనా, అధినేత అవకాశమిచ్చేనా