iDreamPost
android-app
ios-app

వసూళ్లతో ముంచెత్తింది – ఉప్పెన 3 రోజుల కలెక్షన్లు

  • Published Feb 15, 2021 | 5:43 AM Updated Updated Feb 15, 2021 | 5:43 AM
వసూళ్లతో ముంచెత్తింది – ఉప్పెన 3 రోజుల కలెక్షన్లు

ఏడాది పాటు నిరీక్షించి థియేటర్ల కోసమే ఇంతకాలం ఆగిన ఉప్పెన దాని కన్నా ఎక్కువ ఫలితాన్నే అందుకోవడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. టాక్ సంగతి మొదట్లో డివైడ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా కలెక్షన్ల సునామి దీన్ని సూపర్ హిట్ స్థాయిని దాటించేస్తోంది. ఈ రోజు సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉండబోతున్నాయనేది కీలకంగా మారుతుంది. టికెట్ రేట్ల పెంపు ఉప్పెనకు చాలా ప్లస్ అయ్యింది. డెబ్యూ హీరోల్లో ఇప్పటిదాకా టాప్ లో ఉన్న అఖిల్, చిరుతలను దాటేసి ఉప్పెన ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. దానికి తోడు పోటీగా ఇంకే చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం ఉప్పెన పాలిట వరమయ్యింది.

ముఖ్యంగా బిసి సెంటర్లలో ఉప్పెన అరాచకం మాములుగా లేదు. క్రాక్ తర్వాత ఆ స్థాయిలో మాస్ రెస్పాన్స్ దక్కించుకున్న సినిమా ఇదొక్కటే. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు మూడు రోజుల వీకెండ్ కు గాను 26 కోట్ల 78 లక్షలు వసూలు చేసి ఔరా అనిపించేసింది. డెబ్యూ డైరెక్టర్ కొత్త హీరో హీరోయిన్లతో ఇంత స్థాయి ఫలితం దక్కించుకోవడం నిజంగా గొప్ప విశేషం. ఆలా అని ఉప్పెనకు రంగస్థలం తరహాలో యునానిమస్ గా ఇండస్ట్రీ హిట్ టాక్ రాలేదు. అయినా కూడా ఈ స్థాయిలో ప్రభావితం చేయగలగడం చిన్న విషయం కాదు. ఏరియాల వారీగా ఫిగర్స్ ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారీగా ఉప్పెన మొదటి వారాంతం ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

AREA SHARE
నైజాం  8.29cr
సీడెడ్   3.87cr
ఉత్తరాంధ్ర  4.13cr
గుంటూరు   1.60cr
క్రిష్ణ   1.77cr
ఈస్ట్ గోదావరి  2.40cr
వెస్ట్ గోదావరి  1.53cr
నెల్లూరు   0.88cr
Total Ap/Tg  24.47cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.55cr
ఓవర్సీస్ 0.76cr
ప్రపంచవ్యాప్తంగా 26.78cr

ఒకవేళ ఇదే ఉధృతి ఇంకా కొనసాగితే మాత్రం ఫైనల్ రన్ లోపు ఈజీగా 50 కోట్ల షేర్ దాటడం ఖాయం. సుకుమార్ చెప్పిన వంద కోట్ల చేరుకోవడం అసాధ్యమేమో కానీ అందులో సగం పెద్ద మ్యాటర్ కాదు. టికెట్ ధరలు తగ్గాక క్రౌడ్ ఇంకా పెరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉప్పెన తప్ప ఇంకే బలమైన సినిమా లేదు. ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ వారం దాటకుండానే దుకాణం సర్దేసి యుట్యూబ్లో కూడా ఒక్క రోజు ఆఫర్ కింద వచ్చేసింది. సో ఇంకో పది రోజులు కనక ఉప్పెన ఇలా కంటిన్యూ అయితే మాత్రం వైష్ణవ్ రికార్డుని ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమే