Idream media
Idream media
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో వచ్చే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు ఇన్ చార్జిలను నియమించిన పార్టీ అధిష్టానం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర నిర్వహించేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇటీవల పార్టీ ముఖ్యనేతల మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ఈ రథయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఇటీవల పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్ చార్జి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిని కవర్ చేస్తూ ఆరు రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ యాత్రకు ఇన్ చార్జిగా యూపీ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడు విద్యాసాగర్ సోంకర్ ను నియమించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల వారీగా ఇన్ చార్జీలను నియమించారు. పశ్చిమ ప్రాంతం బ్రీజ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను నియమించారు. బ్రీజ్ ఏరియాకు రక్షణ మంత్రి అవథ్ కాశీ ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు.
కాన్పూర్ రీజియన్ లకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నియమించారు. అలాగే బూద్ అధ్యక్షులుగా పార్టీ ఇన్ చార్జులను నియమించారు. మొదటిసారిగా ఇలా సీనియర్ నేతలను నియమించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని తరువాత వెంటనే రథయాత్రలను నిర్వహిస్తుండడంతో వచ్చే ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యాత్రల వివరాలు అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ఈ యాత్రల్లో నాయకులు నేరుగా ప్రజలను కలుస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ 2017 కంటే ముందు రాష్ట్రం ఎలా ఉండేది..? ఇప్పుడెలా ఉంది..? అనే విషయాలపై ప్రజలకు వివరించనున్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో బీజేపీ సాధించిన విజయాలను ప్రజలకు చెప్పనున్నట్లు తెలిసింది.
యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 నియోజకవర్గాలను గెలుచుకుంది. ఇటీవల వివిధ పార్టీలకు చెందిన 11 మంది నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలుస్తుందన్నారు. అంతేకాకుండా మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. పార్టీ నిర్వహించే యాత్రల్లో జాతీయ రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
Also Read : Bjp.Modi – గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?