iDreamPost
iDreamPost
అరాచకానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది కెజిఎఫ్ 2 టీజర్. ఊహించని రేంజ్ లో పట్టుమని మూడు రోజులు కూడా గడవకముందే 100 మిలియన్ల మార్క్ దాటేసి సరికొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. 6 మిలియన్ల లైకులతో తనతో పోటీ ఎంత ప్రమాదమో ఇతర సినిమాలకు ముందే హెచ్చరిక ఇస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ట్రైలర్ వచ్చాక ఏం జరగబోతోందో ఊహించడం కూడా కష్టమే. సోషల్ మీడియాలో కెజిఎఫ్ 2 తాలూకు ఎలివేషన్ స్క్రీన్ షాట్లు ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి. యూట్యూబ్ అఫీషియల్ కౌంట్ మాత్రమే పైన చెప్పిన ఫిగర్. ఇతరత్రా రూపాల్లో అనధికారికంగా ఫ్యాన్స్ షేర్ చేసుకున్నవి లెక్కబెట్టడం కష్టం.
చూస్తుంటే ఇండియా మోస్ట్ వ్యూడ్ టీజర్ గా కెజిఎఫ్ 2 నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక కన్నడ సినిమాకు ఈ స్థాయి స్పందన అంటే ఊహకందనిది. ఇదంతా ఫస్ట్ చాప్టర్ ప్రభావమే అయినప్పటికీ దానికి ఎన్నో రేట్లు రెట్టింపు హీరోయిజం ఇందులో ఉంటుందన్న క్లూ టీజర్ లో ఇచ్చేయడంతో అభిమానుల అంచనాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. ఏకంగా అయిదు లక్షలకు పైగా కామెంట్లతో అక్కడి సెక్షన్ ని అభిమానులు హోరెత్తిస్తున్నారు. దీన్ని బట్టి అన్ని భాషల్లో కెజిఎఫ్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని దెబ్బకు బిజినెస్ లెక్కలు కూడా మారబోతున్నాయి. క్రేజీ ఆఫర్స్ తో ట్రేడ్ వేలంవెర్రిగా పోటీ పడుతోందట.
ఇదంతా చూస్తుంటే కెజిఎఫ్ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో హీరో యష్ కు పెద్ద సవాల్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు కృష్ణకు అల్లూరి సీతారామరాజు లాంటి అల్టిమేట్ బ్రేక్ వచ్చాక దాని వల్ల వచ్చిన అంచనాలు నిలబెట్టుకోలేక చాలా ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. బాహుబలి తర్వాత సాహో విషయంలో ప్రభాస్ కు ఇదే అనుభవమయ్యింది. అందుకే యష్ ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదు. పూరి జగన్నాధ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది కానీ అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఖరారుగా ఏదీ చెప్పలేం. వంద మిలియన్లు పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ వైపు పరిగెత్తుతున్న కెజిఎఫ్ 2 ఇంకెన్ని విధ్వంసాలు ప్లాన్ చేసుకుందో.
Teaser Link @ http://bit.ly/3q6Paso