Union Budget 2024: బడ్జెట్‌లో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ప్రతి నెల రూ.5 వేలు

Union Budget 2024- Good News for Unemployed: పార్లమెట్ లో మంగళవారం(జులై 23) ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2024 వార్షిక బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు.

Union Budget 2024- Good News for Unemployed: పార్లమెట్ లో మంగళవారం(జులై 23) ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2024 వార్షిక బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు.

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు మంగళవారం(జులై 23) 2024-25 వార్షిక సంవత్సరానికి గాను పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులు సహా అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి.. ఈ పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై కోటి ఆశలు పెట్టుకున్నారు. యావత్ దేశం బడ్జెట్ సమావేశాలపై ఫోకస్ పెట్టారు. నిరుపేద కుటుంబాలకు పలు కొత్త పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. రాబోయే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఊరటనిచ్చే విషయాన్ని తెలిపారు. వివరాల్లోకి వెళితే..

2024-25 వార్షిక సంవత్సరానికి గాను నేడు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు గొప్ప శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగాం మూడు ఉద్యోగ అనుసందాన ప్రోత్సాహకాలను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటీవ్ ల కోసం మడు పథకాలు ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాల కల్పనలో భాగంగా తొలి నెల వేతనం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపుల్లో ప్రోత్సహకాలు అందిస్తామని.. ఈ నిర్ణయంతో 1.10 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు. తొలిసారి సంఘటిత రంగంలోకి ప్రవేశించిన ఉద్యోగులకు ఒక నేల వేతనం మూడు వాయిదాల్లో చెల్లించే ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.

గరిష్టంగా రూ.15 వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. నెలకు గరిష్టంగా లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు అని స్పష్టం చేశారు. అలాగే 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 12 నెలల్లో ప్రొఫేషనల్ గా తీర్చి దిద్దుతాం. వారికి ఇంటర్న్ షిప్ అలవెన్స్ గా ప్రతి నెల రూ.5 వేల రూపాయలు అందించడం జరుగుతుందని ప్రకటించారు. వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రమిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్ద గృహాలను నిర్మించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.

Show comments