iDreamPost
android-app
ios-app

నిరుద్యోగ, విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఆ పథకంతో లక్ష!

  • Published Aug 26, 2024 | 9:48 PM Updated Updated Aug 26, 2024 | 9:48 PM

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పరిపాలనలో తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యార్ధులకు, నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు.

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పరిపాలనలో తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యార్ధులకు, నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు.

నిరుద్యోగ, విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఆ పథకంతో లక్ష!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన మార్క్ చాటుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. తాజాగా నిరుద్యోగులు, విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ప్రభుత్వం సివిల్స్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఉత్తర్ణులై, మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సివిల్ సర్వేంట్లు రావాలన్నారు. మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు కూడా లక్ష రూపాయలు సాయం అందజేస్తాం.

ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేశాం. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో యాంగ్ ఇండియా వర్సిటీ ద్వారా రెండు వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం 20 వేల మందికి శిక్షణ ఇప్పిస్తాం. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.. రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాడు చేస్తాం. అంతేకాదు త్వరలో అన్ని వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తాం’అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.