iDreamPost
android-app
ios-app

ప్రభుత్వం కొత్త నిర్ణయం.. సామాన్యులకు అందుబాటులో రియల్ ఎస్టేట్!

  • Published Jul 25, 2024 | 8:02 PM Updated Updated Jul 25, 2024 | 8:02 PM

In Future Will Real Estate Available For Common People Due To Indexation Benefit?: ఫ్యూచర్‌లో ల్యాండ్ ధరలు తగ్గుతాయా? సామాన్యులకు అందుబాటులో రియల్ ఎస్టేట్ ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం సామాన్య, మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టలేని పరిస్థితి. స్థలం, ఇల్లు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అలాంటి వారికి మంచి రోజులు రానున్నాయా? అంటే అవుననే అంటున్నారు.

In Future Will Real Estate Available For Common People Due To Indexation Benefit?: ఫ్యూచర్‌లో ల్యాండ్ ధరలు తగ్గుతాయా? సామాన్యులకు అందుబాటులో రియల్ ఎస్టేట్ ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం సామాన్య, మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టలేని పరిస్థితి. స్థలం, ఇల్లు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అలాంటి వారికి మంచి రోజులు రానున్నాయా? అంటే అవుననే అంటున్నారు.

ప్రభుత్వం కొత్త నిర్ణయం.. సామాన్యులకు అందుబాటులో రియల్ ఎస్టేట్!

కేంద్రం కొత్త బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ పై ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై కొందరు సానుకూలంగా ఉండగా.. మరి కొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ బడ్జెట్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై సానుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం అంటే? సామాన్య, మధ్యతరగతి ప్రజలకు లాభం అని.. మిగతా వర్గాల వారికి నష్టం అని చెబుతున్నారు. ఇండెక్సేషన్ బెనిఫిట్స్ తొలగించడం వల్ల భూముల కొనుగోళ్లు తగ్గిపోతాయని కొందరు రియల్టర్లు తమ అభిప్రాయాలను ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తొలగించడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే?:

ఎప్పుడో 20, 30 ఏళ్ల ముందు కొన్న భూమి ధర ఇప్పుడు ఎన్ని లక్షలు, కోట్లు ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు, మార్కెట్ ధరకి అసలు సంబంధమే ఉండదు. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండడం వల్ల ద్రవ్యోల్బణం విలువ, భూమి కొన్నప్పుడు ఉన్న విలువని తీసేసి మిగతా అమౌంట్ కి 20 శాతం పన్ను ఉండేది. కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం విలువ, భూమి విలువ సమానంగా చూపించి ఆ 20 శాతం పన్ను కూడా చెల్లించని వారు ఉన్నారు. 

అందుకే ఇన్నాళ్లు ఇలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఉన్న ఇండెక్సేషన్ బెనిఫిట్ ని ఇప్పుడు తొలగించారు. ఆ బెనిఫిట్ ని తీసేసి ఆస్తి ఎంత ఉంటే అంత ఆస్తికి 12.5 శాతం పన్ను చెల్లించాల్సిందే అని కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది నియంత్రణలోకి వస్తుందని.. రియల్ ఎస్టేట్ భూముల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. బ్లాక్ మనీని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా మంది పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ఇండెక్సేషన్ బెనిఫిట్ ని ఎత్తివేయడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో లాభం రానుంది.

ఇప్పుడు ఎవరైనా గానీ ఆస్తి ఎంత ఉన్నా కూడా అందులో 12.5 శాతం పన్ను కట్టాల్సిందే. దీని వల్ల ఎప్పుడో తక్కువ రేటుకి వందల ఎకరాల భూమి కొని 10, 20 ఏళ్ల పాటు ఉంచుకుని వేల కోట్లకు అమ్ముకునే వారికి దెబ్బ పడుతుంది. అయితే ఈ నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ పై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం చూపించినా గానీ ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ గాడిలోకి వస్తుందని అంటున్నారు. ఇతర దేశాల్లో మాదిరి రియల్ ఎస్టేట్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలని.. పారదర్శకంగా క్రయ, విక్రయాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్రం.. ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ ని ఎత్తివేసి ఫ్యూచర్ లో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేసే ఆలోచనలో ఉందేమో అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

దీని వల్ల ధరలు బయట మార్కెట్ ప్రకారం అడ్డగోలుగా ఉండకుండా ప్రభుత్వ మార్కెట్ ప్రకారం సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అయితే దీని వల్ల రియల్ ఎస్టేట్ పడిపోతుందా అంటే అలా ఏం జరగదని.. పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు ఉంటాయని.. దారుణమైన లాభాలు ఉండవు గానీ సంతృప్తికరమైన లాభాలు అయితే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళే గంపగుత్తగా భూములు కొనేసి కోట్లు గడిస్తున్నారు. కానీ సామాన్యులు మాత్రం స్థలం కొనలేని పరిస్థితి. అన్ని వ్యాపారాలు పారదర్శకంగా జరుగుతుంటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే పారదర్శకంగా జరగడం లేదన్న అపవాదు అయితే ఉంది. దానికి చెక్ పెట్టడంలో భాగంగానే ఇండెక్సేషన్ బెనిఫిట్ రద్దు మొదటి అడుగు అని నిపుణులు చెబుతున్నారు.