బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. వ్యాక్సిన్‌కి భారీ కేటాయింపులు..

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021–2022 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సాంప్రదాయానికి భిన్నంగా పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంట్‌ ముందుకు తెచ్చారు. బడ్జెట్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా.. ‘యూనియన్‌ బడ్జెట్‌’ అనే మొబైల్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసినట్లు చెప్పిన నిర్మలా సీతారామన్‌.. కరోనా వ్యాక్సిన్‌ కోసం 35,400 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ముఖ్యంశాలు..

లోక్‌సభలో ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 సాధార ణ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. 

నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా లోక్‌సభలో మూడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వం అత్యంత దిగువ వర్గాలకు అండగా నిలిచేందుకు పీఎంజీకేవై వంటి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు మూడు ఆత్మనిర్భర ప్యాకేజీలు, తర్వాత చేసిన ప్రకటలు స్వయంగా ఐదు మినీ బడ్జెట్లకు సమానం అంటూ వివరించారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీలు నిర్మాణాత్మక సంస్కరణల పరంగా వేగాన్ని పెంచాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.

కేటాయింపులు:

– ఆరోగ్య రంగానికి పెద్దపీట

– 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం

– కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం

– కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల,400 కోట్లు

– నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం ,దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు

– రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు

– 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు

– జల జీవన్‌ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు

– మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌

– కొత్తగా బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు

– వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి

– పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం

– వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ

– 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌ : రైతుల ఆదాయం రెట్టింపులక్ష్యం

– 6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం

– ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం

– ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్‌, బడ్జెట్‌ యాప్‌ రిలీజ్‌ చేసిన కేంద్రం

– అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం

– లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం

– పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌ పథకం

– స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు లక్షా 41 వేల 678 కోట్లు

– రూ.87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు

– ఘనవ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్‌ అర్బన్‌

– 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చే పథకం ప్రవేశం

– తయారీ రంగం మద్దతు కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థను ఏర్పాటు. దానికోసం రూ.20 వేల కోట్ల మూలధనం కేటాయింపు.

– వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి రూ.5 లక్షల కోట్ల రుణాలు

– కొత్తగా 13వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి

– పశ్చిమబెంగాల్‌లో రూ.25 వేల కోట్లతో 675 కి.మీ హైవేల అభివృద్ధి.

– అసోంలో రూ.19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి

– కేరళలో 1100 కిలో మీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి

– 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమలో సరకు రవాణా కారిడార్లు ఏర్పాటులో భాగంగా ఖరగ్‌పూర్‌- విజయవాడ మధ్య ఈస్ట్‌- కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు

– మెగా టెక్స్‌టైల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్కుల ఏర్పాటు వచ్చే మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు

– వాయుకాలుష్య నివారణకు రూ.2,217 కోట్లు.

– మూడో ప్రాధ్యానతగా సమ్మిళిత అభివృద్ధి అని, నాల్గొవ ప్రాధ్యానత మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధి, ఐదో ప్రాధ్యానత ఇన్నోవేషన్‌ అండ్‌ ఆర్‌ ఎండ్‌ డీ

– రైల్వేలకు రూ. 1.10 లక్షల కోట్లు .

– 2023 నాటికి రైల్వే లైన్ల విద్యుదీకరణ

Show comments