nagidream
Nirmala Sitharaman Says Good News To Them: ఆదాయం పెంచుకునే అవకాశం కోసం ఎదురుచూసేవారికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారి ఆదాయం మరింత పెరగనుంది.
Nirmala Sitharaman Says Good News To Them: ఆదాయం పెంచుకునే అవకాశం కోసం ఎదురుచూసేవారికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారి ఆదాయం మరింత పెరగనుంది.
nagidream
ఆదాయం పెంచుకునే మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. కొంతమంది స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ అంటూ రకరకాల వాటిలో పెట్టుబడి పెడుతుంటారు. ఇటీవల కాలంలో వీటిల్లో పెట్టుబడులు పెట్టేవారు ఎక్కువైపోయారు. అయితే రిస్క్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. అయితే వీరికి ఇప్పుడు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కల్పించనున్నాయి బ్యాంకులు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే యోచనలో బ్యాంకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ కూడా బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛను కల్పించింది.
రుణాలు మంజూరు చేయడం అనేది ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కువగా వస్తేనే.. ఆ వచ్చిన డబ్బుని కస్టమర్స్ కి రుణాలుగా ఇస్తారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. ప్రజలను ఆకర్షించేలా సరికొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తీసుకురావాలని బ్యాంకులకు సూచించారు. ఫిక్స్డ్ డిపాజిట్లను పెంచేలా కొత్త విధానాలను అమలు చేయాలని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు తీసుకునే రుణాలకు, ప్రజలు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు బ్యాలెన్స్ ఉండాలని అన్నారు.
డిపాజిట్ల సేకరణ విషయంలో బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్ అన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చిన నిధులను రుణాలుగా సమకూర్చాలని వెల్లడించారు. అప్పుడే రుణాలకు, డిపాజిట్లకు మధ్య ఉన్న తేడా తగ్గుతుందని అన్నారు. అందుకోసం ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలను, వినూత్న పథకాలను తీసుకురావాలని సూచించారు. ఇక ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. వడ్డీ రేట్లను డీ రెగ్యులేట్ చేశామని అన్నారు. దీంతో బ్యాంకులు డిపాజిట్లను పెంచుకోవడానికి సొంతంగా రేట్లను పెంచుకోవచ్చునని అన్నారు. డిపాజిట్లు పెంచుకునేందుకు వడ్డీ రేట్లు పెంచుకునే స్వేచ్ఛ బ్యాంకులకు ఉందని అన్నారు. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించే అవకాశం కనిపిస్తుంది.
అంటే వడ్డీ రేట్లను పెంచుతుందని దీనర్థం. వడ్డీ రేట్లను పెంచితే కస్టమర్స్ పెరుగుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు పెరుగుతాయి. ఆ డబ్బుని రుణాలుగా మళ్లిస్తారు. దీంతో బ్యాంకులకు ఆదాయం సమకూరుతుంది. అంతకు ముందు వడ్డీ రేట్ల మీద ఆర్బీఐ నియంత్రణ ఉండేది. ఈ కారణంగా బ్యాంకులకు వడ్డీ రేట్లను నచ్చినట్టు పెంచుకునే వెసులుబాటు ఉండేది కాదు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు తగ్గిపోతుండడంతో ఆర్బీఐ గవర్నర్ ఆ నిబంధన వర్తించదని వెల్లడించారు. మీరు కనుక ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని భావిస్తే కనుక.. బ్యాంకులు సరికొత్త వడ్డీ రేట్లు ప్రకటించే వరకు ఆగితే బాగుంటుంది. వడ్డీ రేట్లను పెంచిన తర్వాత డిపాజిట్ చేస్తే మీకు లాభం ఉంటుంది.