iDreamPost
android-app
ios-app

RC15 : రామ్ చరణ్ సినిమాలో ఊహించని ట్విస్టులు

  • Published Feb 15, 2022 | 5:22 AM Updated Updated Feb 15, 2022 | 5:22 AM
RC15 : రామ్ చరణ్ సినిమాలో ఊహించని ట్విస్టులు

ఆర్ఆర్ఆర్ విడుదల మార్చి 25 ఖరారైన నేపథ్యంలో రామ్ చరణ్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుగుతోంది. అభిమానుల అత్యుత్సాహంతో కొన్ని లీకులు ఫోటోలు కూడా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు తీస్తున్న సీన్లు చరణ్ ఫ్లాష్ బ్యాక్ తాలూకు ఎపిసోడ్లకు సంబంధించినవని సమాచారం. తండ్రి కొడుకులుగా ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారని వినికిడి. కాకపోతే రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనిపించకుండా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఇది నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు కానీ ప్రచారమైతే జోరుగానే ఉంది.

స్వతంత్రం రాకముందు ఉన్న కాలానికి సంబంధించిన పీరియాడిక్ డ్రామా ఇందులో ఉంటుందని తెలిసింది. వర్తమానంలో చరణ్ క్యారెక్టర్ వేరే కొత్త షేడ్స్ తో ఉంటుందట. ఈ కారణంగానే హీరోయిన్ కియారా అద్వానీ ఈ షెడ్యూల్ లో కనిపించకపోవడానికి కారణం అయ్యుండొచ్చు. ఇది ఫినిష్ అయ్యాక టీమ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. వేరే క్యాస్టింగ్ ఇక్కడ జాయిన్ అవుతారు. తన వర్కింగ్ స్టైల్ కి భిన్నంగా శంకర్ దీన్ని చాలా వేగంగా తీస్తున్నారు. ఒకవైపు భారీతనం తగ్గకుండా జాగ్రత్త పడుతూనే మరోవైపు విపరీతమైన జాప్యం లేకుండా చరణ్ కాల్ షీట్లను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ లేట్ కాకుండా చూసుకుంటున్నారు.

ఈ ఆర్సి 15కి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. జనవరి 2023 రిలీజ్ అని ఆల్రెడీ దిల్ రాజు చెప్పేశారు కాబట్టి కేవలం ఏడాది గ్యాప్ లోనే మూడు సినిమాలు చూడబోతున్నామన్న ఆనందం మెగా ఫాన్స్ లో గట్టిగా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏప్రిల్ 29న ఆచార్య వచ్చేస్తుంది. మరో ఎనిమిది నెలలు తిరక్కుండానే శంకర్ మూవీ ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే ప్రాజెక్ట్ ఉంటుంది. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి ఉంటుందనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ప్రస్తుతం క్యాస్టింగ్ తదితర ప్రొడక్షన్ పనుల్లో గౌతమ్ బిజీగా ఉన్నాడు. టీజర్లు పాటలే కాదు ఇప్పుడు లొకేషన్ టాక్స్ కూడా లీకవుతున్నాయి

Also Read : F3 Movie : చిరు కోసం వెంకీ సినిమా త్యాగం చేసిందా

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş