iDreamPost
android-app
ios-app

God Father : గాడ్ ఫాదర్ కు భలే చిక్కొచ్చి పడిందే

  • Published Nov 16, 2021 | 8:02 AM Updated Updated Nov 16, 2021 | 8:02 AM
God Father : గాడ్ ఫాదర్ కు భలే చిక్కొచ్చి పడిందే

చిరంజీవి హీరోగా రూపొందుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నయనతార ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తనను తీసుకుంది జోడిగా కాదు. కథలో కీలకమైన ముఖ్యమంత్రి కూతురి పాత్ర కోసం. ఒరిజినల్ వెర్షన్ లో ఇది మంజు వారియర్ చేశారు. తెలుగులో కొంత క్యారెక్టర్ స్వభావాన్ని నయన్ ఇమేజ్ కు తగ్గట్టు దర్శకుడు మోహన్ రాజా సెట్ చేయించారని గతంలోనే టాక్ వచ్చింది. కానీ నయన్ కు జోడిగా చేసే రోల్ కి సత్యదేవ్ ని లాక్ చేయడంతో అసలు చిక్కు వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. సీనియర్ స్టార్ హీరోయినైన తనకు భర్తగా అప్ కమింగ్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఇబ్బందిగా ఉంటుందని వేరే ఆప్షన్ చూడమని నయనతార చెప్పినట్టుగా వార్త.

ఇది నిజమో కాదో కానీ ఇందులో ఆలోచించాల్సిన పాయింట్ అయితే ఉంది. గాడ్ ఫాదర్ మనవాళ్లే కాదు తమిళ ఆడియన్స్ కూడా చూస్తారు. అలాంటప్పుడు అక్కడ భారీ ఫాలోయింగ్ ఉన్న తమ అభిమాన నటిని డిఫరెంట్ కాంబోలో చూసేందుకు ఇష్టపడకపోవచ్చు. ఇక్కడ సత్యదేవ్ కు అనుకున్న పాత్రని లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ చేశాడు. కానీ తనను తీసుకుంటే వినయ విధేయ రామా వైబ్రేషన్ ని అభిమానులు ఫీలవ్వొచ్చనే ఉద్దేశంతో వద్దనుకున్నారు. కానీ ఇప్పుడీ చిక్కుముడి వెరైటీగా పడింది. దర్శక నిర్మాతలు నయన్ ని కన్విన్స్ చేసే పనిలో ఉన్నారట. వీటి తాలూకు ఎపిసోడ్స్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు కాబట్టి ఆలోగా కొలిక్కి తేవాలి

వచ్చే ఏడాది రంజాన్ పండగను టార్గె చేసుకున్న గాడ్ ఫాదర్ ఆలోగా అవుతుందా అంటే చెప్పలేం. అసలే సల్మాన్ ఖాన్ కూడా యాక్ట్ చేస్తున్నారు. డేట్స్ ఫైనల్ అయ్యాయో లేదో తెలియదు. తమన్ ట్యూన్స్ కంపోజ్ చేసి ఇచ్చినట్టు వినికిడి. డాన్సులకు కమర్షియల్ హీరోయిజంకు కాస్త దూరంగా సాగే గాడ్ ఫాదర్ లో హీరో పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే చిరు ఏరికోరి మరీ అది తెలుగులో అప్పటికే డబ్ అయినా సరే రీమేక్ చేసేందుకే నిర్ణయించుకున్నారు. హీరోయిన్ ఉంటుందా లేదా అనేది మాత్రం బయటికి చెప్పడం లేదు. మోహన్ లాల్ జోడి లేకుండా సింగిల్ గా సినిమాను మోశారు. ఇక్కడేం చేస్తారో చూడాలి

Also Read : Ghani : న్యాచురల్ స్టార్ తో మెగా ప్రిన్స్ క్లాష్ ఎందుకొచ్చింది

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş