Idream media
Idream media
గణతంత్ర దినోత్సవ ప్రసంగాల్లో కూడా తెలుగుదేశం నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. దేశభక్తులను స్మరించుకోవాల్సింది పోయి వైసీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం పోయి.. విచ్ఛిన్నమవుతోందని ఆరోపించారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఏపీలో నిజమైన గ్రామ స్వరాజ్యం కనిపిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎన్నోమార్లు వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థతో వచ్చిన మార్పును దేశమంతా గుర్తిస్తోంది. కానీ తెలుగుదేశానికి మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ పాలన ఏపీ గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిందనడానికి కొన్ని నిదర్శనాలివే..
మద్య నిషేధం వైపు అడుగులు..
మద్యపానంపై మహాత్మగాంధీ ఎంతో వ్యతిరేకత చూపేవారు. దేశం ఆర్థికంగా, నైతికంగా ముందడుగు వేయాలంటే మద్యపాన నిషేధం తప్పనిసరని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలుచేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారు. సమూలంగా రద్దు చేశారు. ప్రభుత్వాలు సాధారణంగా మద్యం షాపులు పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తాయి. జగన్ మాత్రం ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ఉన్న షాపులను తగ్గిస్తూ వస్తున్నారు.
పారిశుధ్యం – వీధి దీపాలు..
ఆరోగ్యానికి, పారిశుధ్యానికి అవినాభావ సంబంధం ఉంది. గ్రామాల్లో పారిశుధ్యం సాధిస్తే.. అక్కడ అనారోగ్యం దరిదాపుల్లోకి కూడా రాదు. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీ జిల్లాలోని పలు గ్రామాలు వంద శాతం మరుగుదొడ్లు ఉన్న గ్రామాలుగా రూపొందుతున్నాయి. పల్లెలన్నీ సస్యశ్యామలంగా మారేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వలంటీర్లు కూడా పారిశుధ్యం దృష్టి పెట్టి అధికారుల దృష్టి తీసుకెళ్లాలని సూచించారు. వైసీపీ పాలనకు ముందు వీధి దీపాలు లేని గ్రామాలు చాలానే ఉండేవి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వెలుగులు నిండుతున్నాయి. వీధి దీపాల నిర్వహణపై కూడా వలంటీర్లు దృష్టి సారిస్తున్నారు.
పాలనలో పారదర్శకత..
పాలన పారదర్శకంగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీగా పాలకవర్గం ఉండాలని గాంధీజీ ఏనాడో చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని తన ఆత్మకథలోనూ రాసుకున్నారు. ప్రజాహితాన్ని మనస్సులో పెట్టుకొని విశాల హృదయంతో నిజాయతీగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు మెరుగ్గా ప్రభుత్వాన్ని రక్షిస్తారు. ప్రజాప్రతినిధులు ఎక్కడో కూర్చొని ప్రజా ప్రభుత్వాన్ని నడపలేరు. ప్రతి గ్రామంలోని నాయకులు పారదర్శకంగా పనిచేసినప్పుడే ఆ గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. నిధుల వ్యయంలో పారదర్శకత ఉంటే నాయకుడిపై నమ్మకం పెరుగుతుందని గాంధీజీ భావించారు. జగన్ పాలన ఆయనకు అనుగుణంగానే నడుస్తుందన్న గుర్తింపు ఉంది. అందుకు నిదర్శనం తన పాలనపై తానే రిఫరెండెం ప్రకటించడం. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇంటింటికీ మేనిఫెస్టోలను పంచిన ఘనత జగన్ దే.
విద్యకు అధిక ప్రాధాన్యం..
ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను చూస్తే.. కార్పొరేట్ సంస్థలు అవాక్కవ్వాల్సిందే. బ్రాండెడ్ కంపెనీల ఫ్యాన్లు, అధునాతన టాయిలెట్లు, నిత్యం మంచినీటి సదుపాయం, తరగది గదుల్లో టైల్స్.. వంటి సౌకర్యాలను నాడు – నేడు ద్వారా ఏపీ ప్రభుత్వం కల్పించింది. విద్యా రంగానికి రాష్ట్ర చరిత్రంలోనే అధిక నిధులు వెచ్చించింది. 19 నెలల ప్రభుత్వ పాలనలో పిల్లల చదువుల కోసం అక్షరాల రూ.24 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వంగా రికార్డు సాధించింది. నాడు – నేడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వ కృషి వల్లే పిల్లలందరూ బడిబాట పడుతున్నారు.
పేదలకు ఆర్థిక అభివృద్ధి..
పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని గాంధీ చెప్పేవారు. ఏపీ ప్రభుత్వం కూడా అందుకనుగుణంగా ఆది నుంచీ ప్రణాళికలు రచిస్తోంది. తమకుతామే ఆర్థిక ప్రగతిని పెంచుకోవాలి అనే గాంధీజీ ఆలోచనలు నేడు అమలవుతున్నాయి. ప్రభుత్వం అందించిన నగదు బదిలీ పథకం ద్వారా ఎంతో మంది ఉపాధి కల్పన వైపు అడుగులు వేస్తున్నారు. రాజ్యాంగంలోని 11వ షెడ్యుల్‌లో ప్రకటించిన 29 అంశాలను వేగవంతం చేసినప్పుడే పంచాయతీలు పూర్తి స్థాయిలో అభివృద్ధిని సాధిస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మహిళాభ్యుదయం..
స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని గాంధీ కోరుకున్నారు. ఆయన ఆశయాలకనుగుణంగానే ఏపీలో పథకాలు అమలు అవుతున్నాయి. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాపు నేస్తం కింద లబ్ధిదారులైన ఒక్కో మహిళకు రూ. 15000, అమ్మ ఒడి ద్వారా 15000, డ్వాక్రా రుణ మాఫీ, ఎస్సీ, ఎస్టీ మహిళకు రూ. 18000 … ఇలా ప్రభుత్వం నగదు బదిలీ చేయడంతో ఆర్థిక స్వాతంత్య్రం పొందుతున్నారు. త్్త చేస్తూ.. అన్నింటా 50 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేస్తుండడంతో రాజకీయల్లోనూ రాణిస్తున్నారు.. ఇలా జగన్ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ద్వారా ఏపీ గ్రామ స్వరాజ్యం వికసిస్తోంది.