iDreamPost
android-app
ios-app

విభజనపై పార్లమెంట్ లో చర్చించండి – ఉండవల్లి లేఖాస్త్రం

విభజనపై పార్లమెంట్ లో చర్చించండి – ఉండవల్లి లేఖాస్త్రం

రాష్ట్ర విభజన సమస్యలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రత్యేక చర్చను లేవనెత్తాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డిని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ మార్ కోరారు . ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు . ఈ నెల 18 నుంచి శీతాకాల సమావే శాలు ప్రారంభమవుతున్న నేప థ్యంలో వైసీపీ ఎంపీల ద్వారా నోటీసు ఇప్పించి అడ్డగోలు విభజనపై కచ్చితంగా చర్చ జరిగేలా చూడాలని ఆయన కోరారు . ఏపీ విభజన చాలా అన్యాయం జరిగిందని ఉండవల్లి పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏపీ విభజన పై చర్చను చేపట్టాలని లోక్ సభ స్పీకర్ 3 నోటీసు ఇవ్వాల్సిందిగా వైసిపి ఎంపీలకి సూచించాలని ఆయన కోరారు .

ఇదిలా ఉండగా , విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దారుణమైన అన్యాయం జరిగిందని , ఆ అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ ,హెూంమంత్రి అమిత్ షా కూడా గతంలో అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు, కాశ్మీర్ కి సంబంధించిన కీలక 370,35A ఆర్టికళ్ల రద్దు లాంటి కీలక అంశంలో పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకి వెళ్లారు . ఏ పార్లమెంట్లో ఇంత హడావుడిగా ఏపీ విభజన జరిగిందో ఆదే పార్లమెంట్లో ఇప్పటివరకి ఏపీ విభజనపై చర్చ జరగలేదని , ఈ సారైన చర్చ జరిగేలా వైసిపి పట్టుబట్టాలని ఆయన తన లేఖ ద్వారా సీఎం జగన్ కి తెలిపారు .అప్పుల రాష్ట్రంగా మిగిలిన ఏపీకి ఇచ్చిన హామీలు నేటికి నెరవేరక పోవడంతో,  రాష్ట్రం రుణభారంతో  ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో పార్లమెంటలో ఏపీ విభజనపై చర్చ జరిగితే బావుంటంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది .