iDreamPost
iDreamPost
ఉక్రెయిన్ పై రష్యా చేసిన భీకర యుద్ధంలో చాలా నగరాలు నామరూపాల్లేకుండా పోయాయి. రాజధాని కీవ్ పై కూడా రష్యా సేన దాడి చేయగా.. ఉక్రెయిన్ బలగాల ఎదురుదాడులతో వెనుదిరిగింది. పాక్షికంగా దెబ్బతిన్న కీవ్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రోజువారీ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా కీవ్ నగర శివారులోని పొదిల్ లో ఉన్న ఓ థియేటర్ తెరచుకుంది. థియేటర్ తెరిచినపుడు.. ప్రజల మళ్లీ థియేటర్ కు వచ్చి సినిమా చూసే పరిస్థితిలో ఉన్నారా ? అసలు థియేటర్ కు వచ్చే ఆసక్తి ఉందా ? అన్న అనుమానాలు వచ్చాయట ఆ థియేటర్ ప్రసారమైన సినిమాలోని నటులకు.
కానీ.. తొలిరోజు ప్రదర్శించిన మూడు ఆటలకు మొత్తం టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో అవాక్కయ్యామని నటుడు యురియ్ ఫెలిపెంకో పేర్కొన్నారు. నగరానికి తిరిగొస్తున్న పౌరులను చూసి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమైనట్లు మరో నటుడు కొత్స టిమ్లియాంక్ తెలిపాడు. కాగా.. ఉక్రెయిన్లో ఇంకా యుద్ధం జరుగుతున్న విషయాన్ని మరిచిపోకూడదని, నటులు ఏ విధంగా సహాయపడగలరన్నదే అసలైన ప్రశ్న అని ప్రదర్శనకారులు పేర్కొన్నారు.