iDreamPost
iDreamPost
ఇప్పటి వరకు, ఒకసారి ట్వీట్ చేసిన కంటెంట్‌ని ఎడిట్ చేయడం సాధ్యం కాదు. కంటెంట్ కు మార్పులు చేస్తే, మళ్లీ ట్వీట్ చేయాల్సి వచ్చింది
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ని ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం వ్యక్తిగతంగా, ప్రభుత్వాలూ వాడుతున్నాయి. ట్విట్టర్ చరిత్రలోనే అతిపెద్ద మార్పు ఈనెలాఖరకు రానుంది. ట్వీట్ చేసిన 30నిమషాల్లోగా కంటెంట్ ను సవరించడానికి ఒక ఫీచర్‌ను జోడించింది. కాకపోతే దీనికోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్ లకు ఎడిట్ బటన్ అందుబాటులోకి రానుంది.
ఇప్పటి వరకు, ఒకసారి ట్వీట్ చేసిన కంటెంట్‌ని ఎడిట్ చేయలేం. మళ్లీ ట్వీట్ చేయాల్సి వచ్చింది.
ఇది ఎలా పని చేస్తుంది?
ఎడిట్ బటన్ ను 30 నిమిషాలలోగా చేసిన ట్వీట్లలో మార్పులు చేయడానికి యూజర్లకు అనుమతినిస్తుంది. కాకపోతే మీరు కనుక ట్విట్ ను ఎడిట్ చేస్తే ట్వీట్ సవరించబడిందని సూచించే సింబల్ ను చూపిస్తుంది. ఏం చేంజెస్ చేశారో తెలుసుకోవాలనుకొంటే Twitter యూజర్లు ట్వీట్‌ని క్లిక్ చేసి అసలు కంటెంట్‌కి చేసిన అన్ని మార్పులను చూడొచ్చు.
Twitterకు 320 మిలియన్ల మంది యాక్టీవ్ సబ్ స్క్రైబర్లున్నారు. పోస్ట్‌లను పబ్లిష్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకొనే ఫీచర్‌ను ఎక్కువమంది యూజర్లు అడుగుతున్నారు. పదేపదే అడిగా Twitter ఈ ఫీచర్ ను జోడించడానికి ఒప్పుకోలేదు.
2020లో వైర్డ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అప్పటి Twitter CEO జాక్ డోర్సే “ఎడిట్ ట్వీట్” ఫీచర్ పై నెగిటీవ్ గా రియాక్ట్ అయ్యారు. తప్పుడు సమాచారం వ్యాప్తికి ఇది సాయం చేయొవచ్చని అనుమానించారు. ఇప్పుడు ట్విట్టర్ టెస్ట్ చేస్తోంది.