iDreamPost
android-app
ios-app

Good News : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

  • Published May 24, 2022 | 11:08 AM Updated Updated Dec 14, 2023 | 6:55 PM

అలాగే జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లు, ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

అలాగే జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లు, ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

Good News : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త అందించింది. ఆగస్టు నెలకు సంబంధించి.. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్ లైన్లో విడుదల చేసింది. అలాగే జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లు, ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

ఈ సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని టిటిడి పేర్కొంది. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ఆన్ లైన్ డ్రా తీసి, సేవా టికెట్లను పొందిన వారికి సమాచారమిస్తామని టిటిడి తెలిపింది. కాగా.. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భక్తుల రద్దీ కారణంగా చాలామంది భక్తులు గదులు దొరక్క అవస్థలు పడుతున్నారు.