Krishna Kowshik
Krishna Kowshik
పండుగలు, అందులోనూ ఎక్కువ రోజు సెలవులు వస్తున్నాయంటే ఇంటిల్ల పాదీ స్వగ్రామాలకు వెళుతుంటారు. ఈ సమయంలోనే ప్రయాణీకులను ఆకర్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ఇటీవల ఓ లక్కీ డ్రా ఆఫర్‌ను ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా అది ఈ రోజు నుండి అమల్లోకి రానుంది. టీఆర్టీసీ బస్సుల్లో టికెట్టుతో ప్రయాణించే వారికి ఈ అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో గెలిచిన విజేతలకు రూ. 11 లక్షలు అందజేయనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 30 వరకు కొనసాగనుంది. ఈ బంఫర్ ప్రైజ్ గెలవాలంటే టీఎస్ఆర్టీసీలో ప్రయాణించాల్సి ఉంటుంది.
టికెట్ తీసుకున్న తర్వాత.. మీ గమ్య స్థానం చేరాక.. టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్ రాసి.. ఆయా బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సులో వేయాలి. దీని నిమిత్తం బస్టాండ్లు, ట్రాఫిక్ జనరరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి.. 10 మంది విజేతలను ప్రకటిస్తారు. వీరిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉంటారు. మొత్తం 110 మందిరి ఒక్కొక్కరికి రూ. 9,900 చొప్పున బహుమతులు ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని, సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ విజి సజ్జనార్ ఎక్స్ లో పేర్కొన్నారు.
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో #TSRTC నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్… pic.twitter.com/TZLQFxylGU
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) October 17, 2023