iDreamPost

ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పిన TSRTC

ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పిన TSRTC

వీ.సీ సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికుల ముందు ఎన్నెన్నో ఆఫర్లును ఉంచుతూ ఆర్టీసీని లాభాల్లో ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే టీఎస్ఆర్టీసీ మరో ప్రయాణికులకు మరో శుభవార్తను అందించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు టీఎస్ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ఏంటంటే?

ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు టీఎస్ఆర్‌టీసీ ఓ గుడ్ న్యూస్ ను అందించింది. శుక్ర, శని, అదివారం వరుస సెలవులను దృష్టిలో పెట్టుకుని TSRTC ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తాజాగా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి చెన్నై, విశాఖ‌ప‌ట్నం, కాకినాడ‌, షిర్డీ, అమ‌లాపురం వంటి ప్రాంతాలకు ఈ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు TSRTC ఎండీ సజ్జనార్ తాజాగా వెల్లడించారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. అయితే టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు అధికారిక వెబ్ సైబ్ http://tsrtconline.in లో బుక్ చేసుకోవచ్చని ప్రకటనతో తెలిపారు. ఇదే కాకుండా పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చని తెలిపారు.

ఇది కూడా చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి