iDreamPost
android-app
ios-app

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు సంచలన తీర్పు

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు భక్తులు. మండపాలను అద్భుతంగా అలంకరించి వివిధ రూపాల్లోని గణనాథులను ఏర్పాటు చేసుకుని భక్తిశ్రద్దలతో వేడుకలను జరుపుకుంటున్నారు. నిత్యం పూజలు, భజనలతో వినాయకుడి సేవలో భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు భక్తులు. ఇక హైదరాబాద్ మహానగర విషయానికి వస్తే.. గల్లీ గల్లీకి ఒక గణేషుడు కొలువై పూజలు అందుకుంటున్నాడు. కాగా ఇప్పటికే కొంతమంది గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ నెల 28 వరకు అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నిమజ్జనాల విషయం పట్ల సంచలన తీర్పు వెల్లడించింది. హుస్సేన్ సాగర్ లో ఆ విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కాలుష్య నివారణ కోసం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను మాత్రమే పూజించాలని ప్రభుత్వాలు సూచించిన విషయం తెలిసిందే. దీని కోసం మట్టి విగ్రహాల పంపిణీ కూడా చేపట్టింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలు నేలను, నీటిని కలుషితం చేస్తాయని వాటి తయారీలో ఉపయోగించే రసాయనాలు హాని కలుగ చేస్తాయని అందుకోంసం మట్టి విగ్రహాలను మాత్రమే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతున్న వేళ టీఎస్ హైకోర్టు షాకింగ్ తీర్పును వెల్లడించింది.

హుస్సేన్ సాగర్, చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయాలని నగర సీపీ జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నిమజ్జనం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి