నిర్లక్ష్యమా..? ‘ట్రంపు’రితనమా..?

కరోనా వైరస్ ప్రారంభ సమయంలో దాన్ని తేలిగ్గా తీసుకుని తన నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి మళ్ళీ అదే బాటలో పయనిస్తూ ఉన్నట్లుగా ఆయన మాటల ద్వారా అర్ధం అవుతోంది. అమెరికాలో ప్రతిరోజు వేలాది మందికి వైరస్ సోకుతుంది. వేలాది మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 33 లక్షల మందికి ఈ వైరస్ సోకగా.. అందులో మూడు వంతుల్లో ఒక వంతు భూ భాగం అమెరికాలో నమోదయ్యాయి. మరణాలది ఇదే తీరు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. మహమ్మారి కరోనా దానంతట అదే పోతుందని చెప్పారు. వ్యాక్సిన్ పై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వారంలో అమెరికాలో ఆంక్షలు ఎత్తివేసే స్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భౌతిక దూరం నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదన్నారు. రవాణా సౌకర్యాలను కూడా పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను సరిచేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశీయంగా విమాన సేవలను కూడా మళ్ళీ మొదలుపెడతామని చెప్పారు.

కనిపించిన శత్రువుతో పోరాడే ప్రాణం కోల్పోయిన ప్రతి ఒక్కరికి అశ్రునివాళి అర్పిస్తున్నానని చెప్పిన ట్రంప్.. వైరస్ త్వరలోనే నశించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు అందరూ ఓపిక పట్టాలని చెప్పి అందరినీ విస్మయానికి గురి చేశారు. ఏమైనా సరే.. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి త్రైమాసికాని కల్లా ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధ్యక్ష భవాని కే పరిమితమైన డోనాల్డ్ ట్రంప్ వచ్చేవారం ఆరిజోనా రాష్ట్రంలోని పర్యటించనున్నట్లు తెలిపారు.

Show comments