iDreamPost
android-app
ios-app

అఖండ భారత్ -శ్రీలంక,నేపాల్లో గెలుస్తాం అంటున్న బీజేపీ సీఎం …

అఖండ భారత్ -శ్రీలంక,నేపాల్లో గెలుస్తాం అంటున్న బీజేపీ సీఎం …

రాజకీయాల్లో అత్యాశలు, అతిశయొక్తులు సహజం. పార్టీ ఇమేజ్ పెంచడానీకో లేక తమ బలం చాలా ఎక్కువ అని చెప్పుకోవడానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడే నేతలకు కొదవలేదు. పార్టీ నానాటికీ దిగజారుతూ చివరికి ఉప ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతున్న టీడీపీ కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ మాటలు కోతలు దాటుతుంటాయి. బీజేపీకి కూడా లాంటి నేత ఒకరు తయారవుతున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ త్వరలోనే నేపాల్ శ్రీలంక దేశాలలో సైతం ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా, ఆయా దేశాల్లో పార్టీని విస్తరించే దిశగా బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా ఆలోచిస్తున్నారు అంటూ ఏకంగా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాట్లాడటం సంచలనం అవుతోంది. తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం కలిగించే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ సోమవారం ఓ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అంత సులభమా?

ప్రపంచంలో ఇప్పటి వరకూ ఓ రాజకీయ పార్టీ మరో దేశాన్ని దాటి తన కార్యకలాపాలను విస్తరించింది లేదు. మత కార్యకలాపాలను విస్తరించుకోవడానికి మాత్రమే కొన్ని సంస్థలు అంతర్జాతీయంగా పనిచేస్తున్నాయి. పూర్తి రాజకీయ ఎజెండా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇతర దేశాల్లో ఏ ప్రాతిపదికన విస్తరించాలి అనుకుంటుందో? అమిత్ షా ఎప్పుడు ఈ త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కు ఈ విషయాన్ని చెప్పారు అన్నది తెలియాలి. ప్రతి దేశానికి ఆ దేశ సార్వభౌమాధికారం, సంస్కృతి, సంప్రదాయం మీద ఎడతెగని గౌరవం ఉంటుంది. మరి ఇతర దేశాల నుంచి వచ్చిన ఓ పార్టీని తమ మీద ఆధిపత్యం చలాయించే అధికారం ఇవ్వడానికి ఏ దేశ ప్రజలు ఇష్టపడరు. బీజేపీ అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉన్న ఎలాంటి ఎజెండాను కలిగిన పార్టీ కాదు. మరి ఏ దైర్యంతో ఆయా దేశాలకు పార్టీ విస్తరించి బోతోంది? ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక బిప్లవ్ దేవ్ వ్యూహం ఏంటి? ఆయనతో ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది కూడా చూడాలి.

హిందుత్వం ప్రాతిపదికన!

భారతదేశం తర్వాత అత్యధిక మంది హిందువులు ఉన్నది నేపాల్ లోనే. ఇక్కడ హిందూ మతాన్ని ఆచరించేవారు అధికం. ఇటీవల నేపాల్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని ఓలి ఆకస్మాత్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీంతో అక్కడ రాజకీయ శున్యత ఉంది. తూర్పు భారతదేశానికి చెందిన త్రిపుర నేపాల్ కు దగ్గరగా ఉండే రాష్ట్రం. ప్రస్తుతం నేపాల్లో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని పరిస్థితులను ఓ అంచనా వేసి బిప్లవ్ దేవ్ అక్కడ కూడా తమ సొంత పార్టీ బిజెపి ఉంటే బాగుంటుందన్న ఆశతో, కార్యకర్తలను ఉత్సాహపరిచే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారా? దీనిపై బిజెపి కేంద్ర నాయకత్వానికి ఏమైనా సమాచారం ఉందా? లేక వారి అనుమతి తోనే బిప్లవ్ ఇలా మాట్లాడారా అన్నది పక్కన పెడితే.. శ్రీలంక ను సైతం ఆయన తన వ్యాఖ్యల్లో చేర్చారు. నేపాల్ లో కనీసం హిందుత్వ ప్రాతిపదికన అయినా బిజెపి అక్కడ విస్తరించడానికి ప్రణాళిక వేసుకుని పని సర్ది పుచ్చుకున్నా, శ్రీలంకలో రాజకీయ కార్యకలాపాలు చేయడానికి ఎలాంటి దారులు వెతుకుతుంది అనేది అంతుబట్టదు.

తర్వాత ఘనా లోనేనా?

భారతీయ జనతాపార్టీ ఇది హిందూత్వమే ఎజెండా అనేది బహిరంగ రహస్యం. బిప్లవ్ దేవ్ మాటల్లో అంతర్ జాతీయ పార్టీగా బిజెపి అవతరిస్తుందన్న మాటలతో ఉలిక్కి పడినా కాస్త తేరుకొని చూస్తే తర్వాత ఆఫ్రికా దేశం ఘనాలో సైతం బీజేపీ జెండా పాతేయడానికి సిద్ధం అయిపోవచ్చు. 3 కోట్ల ప్రజలు ఉన్న ఈ ఆఫ్రికా దేశం లో గత దశాబ్దకాలంగా హిందుత్వం ఆచరించే వారు పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఘనా నంద స్వామి రూపంలో గత దశాబ్దం నుంచీ హిందుత్వ ప్రచారం ఈ దేశంలో ఎక్కువగా జరుగుతుంది. ఆయన తదనంతరం సుభానంద్ స్వామి ఆ బాధ్యతలను తీసుకొని హిందుత్వం మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హిందూ మతంలోకి మార్పిడి లో ఎక్కువగా జరుగుతున్న దేశం ఘనా. కాబట్టి ఈ ప్రాతిపదికన బిజెపి అంతర్ జాతీయ పార్టీగా అవతరిస్తే విస్తరణలో తర్వాత దేశం ఘనా గా ఉండొచ్చు. అయితే ఈ విషయం త్రిపుర ముఖ్యమంత్రి గుర్తించి ఉండకపోవచ్చు. లేకుంటే ఆయన మాట ల్లో నేపాల్ శ్రీలంక తో పాటుగా ఘనా పేరు ఉండేది.

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు!

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ తన ప్రసంగాల్లో తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు విచిత్రమైన మాటలు మాట్లాడటం సహజమే. గతంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సంచలనం అయ్యాయి. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఈ సూత్రాన్ని నమ్ముకొన్న బిప్లవ్ దేవ్ ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ తో బిజెపి పార్టీ మీద అంతర్జాతీయ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్నెట్లో మహాభారతం మీద ఇస్తానుసరం ఉందని, అంతర్జాలం నుంచి దీనిని తొలగించాలని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. అలాగే అఖిలభారత సివిల్ సర్వీసెస్ లో ఎక్కువ మంది సివిల్ ఇంజనీర్ లో ఉంటున్నారని వారికే ఆ పోస్టులు చెందుతున్నాయి అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం నవ్వులపాలు అయింది.

గుర్తింపు ఇచ్చిన పార్టీ

2017 లో త్రిపురలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన పార్టీ విస్తృతికి, గిరిజన ప్రాంతాల్లో బిజెపి బలం పుంజుకోవడానికి ప్రధాన కారణం అయ్యారు. అవినీతి మచ్చ లేని వామపక్ష ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న మాణిక్ సర్కార్ ను గద్దె దింపడానికి ప్రధాన కారణం బిప్లవ్ గా గుర్తించిన బీజేపీ అధిష్టానం అతడికి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుబెట్టింది. అయినా సరే ఆయన పాత పద్ధతిలోనే గతంలో పార్టీ నేతగా ఉన్నప్పుడు ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారో ముఖ్యమంత్రి స్థానంలోనూ అలాంటి మాటలే మాట్లాడడం పై బిజెపి అధిష్టానం దృష్టి సారించాలి. ఆయన మాటలు పార్టీకి ఎంతమేర ప్రయోజనం చేస్తాయి ఎంతమేర నవ్వుల పాలు చేస్తాయి అన్నది కూడా కమలనాథులు ఆలోచించి బిప్లవ్ నోటికి తాళం వేయడమే ప్రస్తుతానికి సముచితం.

2017 లో త్రిపురలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన పార్టీ విస్తృతికి, గిరిజన ప్రాంతాల్లో బిజెపి బలం పుంజుకోవడానికి ఒక కారణం అయ్యారు. అవినీతి మచ్చ లేని వామపక్ష ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న మాణిక్ సర్కార్ ను గద్దె దింపడానికి ప్రధాన కారణం బిప్లవ్ గా గుర్తించిన బీజేపీ అధిష్టానం అతడికి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుబెట్టింది.అయినా సరే ఆయన పాత పద్ధతిలోనే గతంలో పార్టీ నేతగా ఉన్నప్పుడు ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారో ముఖ్యమంత్రి స్థానంలోనూ అలాంటి మాటలే మాట్లాడడం పై బిజెపి అధిష్టానం దృష్టి సారించాలి.

ఆయన మాటలు పార్టీకి ఎంతమేర ప్రయోజనం చేస్తాయి ఎంతమేర నవ్వుల పాలు చేస్తాయి అన్నది కూడా కమలనాథులు ఆలోచించి బిప్లవ్ నోటికి తాళం వేయడమే ప్రస్తుతానికి సముచితం. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఖంగారు పెట్టే మాటలు ఉండాలి కానీ వారి దగ్గర చిన్నబుచ్చుకునే వ్యాఖ్యలు వల్ల పార్టీకి నష్టం తప్పదు. భారతదేశంలో రాజకీయాలు చక్కబెట్టడ మే ఇప్పుడు పెద్ద విషయమైతే ఖండాలు దాటి పార్టీని విస్తరించాలి అన్న ఆలోచనలు రావడం సాధారణ విషయం కాదు. ఏది ప్రాధాన్యం? ఏది సానుకూలం అనేది చూడకుండా మాట్లాడితే రాజకీయాల్లో ప్రజలు హర్షించరు. అన్నీ నేనే చేశాను.. కట్టాను… హైదరాబాద్ సైబర్ టవర్ నేనే తెచ్చాను లాంటి మాటలు మాట్లాడిన టీడీపీ పరిస్థితి ఎం అయ్యిందో కళ్ళ ముందు కనిపిస్తున్నా మిగిలిన పార్టీల నేతల్లో కనువిప్పు కలగకపోతే వారికే నష్టం.